సన్నబియ్యంపై నిరుపేదలను ఊరించి ఉసూరుమనిపిస్తారా?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను తెలంగాణా సర్కార్ నిర్వహిస్తోంది. ఇదే సమయంలో రేషన్ కార్డు ఉన్న నిరుపేదలకు శుభవార్త చెప్పింది అనుకున్న సర్కార్ అంతలోనే నిరాశ కలిగించింది.

నిరుపేదలకు సన్నబియ్యం పై మంత్రులు చెప్పిందిదే
త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు అందించడానికి రెడీ అవుతోంది అని, సంక్రాంతికి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తామని మంత్రులు ఊరించి ఊరించి చివరకు ఉసూరనిపించారు. గత రెండు వారాలుగా మంత్రులు ఈ విషయాన్ని చెప్పారు. సంక్రాంతి పండుగ నుండి సన్న బియ్యం ఇస్తామని చెప్పడంతో నిరుపేదలు సంతోషం వ్యక్తం చేశారు.

shock to poor people on fine rice distribution from ration shops

సన్నబియ్యం పంపిణీపై అధికారులు ఏం చెప్పారంటే
అయితే ఇప్పుడు తాజాగా అధికారులు దీనిపైన క్లారిటీ ఇచ్చారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం సంక్రాంతి నుండి కాదు ఉగాది నుండి ఇస్తారని చెబుతున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దీనిపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రైతులు దగ్గర కొన్న కొత్త ధాన్యాన్ని ఇప్పుడు మిల్లింగ్ చేస్తే అవి కొత్త బియ్యం కాబట్టి అన్నం ముద్దగా అవుతుందని తెలిపారు. కనీసం ఇవి రెడీ అవటానికి మూడునెలలు ఆగాలని పేర్కొన్నారు.

ఉగాది నుండి సన్నబియ్యం ఇచ్చే చాన్స్
అంటే దీనిని బట్టి ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తారనే ప్రచారం మొదలైంది. 2025లో ఉగాది మార్చి 30వ తేదీన వచ్చింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు మూడు నెలలు బియ్యాన్ని నిలువ చేస్తే పాత బియ్యంగా మారుతాయి. కాబట్టి అప్పుడు వాటిని ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో రేషన్ కార్డు ఉన్న నిరుపేద లబ్ధిదారులు ఉగాది వరకు సన్న బియ్యం కోసం ఆగాల్సిన పరిస్థితి.

సన్నబియ్యం పంపిణీలో సమస్యలు
అయితే మంత్రులు మాత్రం సంక్రాంతి నుండి సన్న బియ్యం ఇస్తామని ప్రకటనలు చేశారు. మంత్రులు చెప్పిన ప్రకారం సంక్రాంతి నుండి ఇస్తే పేదలు సంతోషిస్తారు కానీ బియ్యం మిల్లింగ్ చోటు చేసుకున్న ఇబ్బంది నేపథ్యంలో మార్చి నుండే ఇస్తారని ఒక అంచనా ఉంది. అయితే సన్నబియ్యం నిరుపేదలకు ఇచ్చే విషయంలో మరొక సమస్య కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సన్న బియ్యం పంపిణీ సాధ్యమేనా?
రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం సంవత్సరం పాటు ఇవ్వాలంటే 24 లక్షల టన్నుల బియ్యం అవసరం ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో అంత సన్న బియ్యం వచ్చే అవకాశం లేదు. ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్న ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేమని ప్రజలు భావిస్తున్నారు.

సన్న బియ్యం కోసం నిరుపేదల పడిగాపులు
ఏదేమైనాప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో సన్న బియ్యంపైన ఎప్పుడు ఇస్తారు అన్న క్లారిటీ రావడం లేదు. మొత్తంగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం కోసం అయితే నిరుపేదలు పడిగాపులు పడుతున్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని గంపెడు ఆశలతో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+