వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ .. రేపు నిరుద్యోగ దీక్ష కోసం తమ ఇంటికి రావొద్దంటూ విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానని రాజకీయ ఆరంగేట్రం చేసిన వైయస్సార్ తనయ , వైయస్ జగన్ సోదరి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఒకపక్క పార్టీలో కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి రాజీనామాల బాటలో పడుతుంటే, మరోపక్క వైయస్ షర్మిలకు ప్రజల నుంచి కూడా ఊహించని షాక్ లు తగులుతున్నా యి.

షర్మిల పార్టీకి తాజాగా ఊహించని మరో షాక్

షర్మిల పార్టీకి తాజాగా ఊహించని మరో షాక్

షర్మిల పార్టీకి ప్రజల నుంచి కూడా ఊహించని షాక్ తగులుతోంది. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలో షర్మిల పాల్గొంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రతి మంగళవారం షర్మిల జిల్లా కేంద్రాలలో నిరుద్యోగ నిరాహార దీక్షలను నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈనెల 24వ తేదీన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ లో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టాలని భావించిన షర్మిలకు ఊహించని షాక్ తగిలింది.

 దీక్ష కోసం తమ ఇంటికి రావొద్దని షర్మిలకు నరేష్ తండ్రి విజ్ఞప్తి

దీక్ష కోసం తమ ఇంటికి రావొద్దని షర్మిలకు నరేష్ తండ్రి విజ్ఞప్తి


దీక్ష కోసం తమ ఇంటికి రావద్దంటూ ఇటీవల నిరుద్యోగ సమస్యతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగ యువకుడు నరేష్ తండ్రి వైయస్ షర్మిల కు విజ్ఞప్తి చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు పునరాలోచనలో పడ్డారు. రేపు దీక్ష చేయాల్సిన నేపథ్యంలో తమ ఇంటికి రావద్దంటూ నిరుద్యోగి నరేష్ తండ్రి చెప్పడంతో షర్మిల రాకను నిరాకరించినట్లు అయింది. ఊహించని విధంగా రేపు ఉదయం దీక్ష ఉందనగా, ఈరోజు నరేష్ తండ్రి షర్మిలను రావద్దని విజ్ఞప్తి చేయడంతో ఏం జరిగి ఉంటుందన్నదానిపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

 ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నరేష్

ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నరేష్


ఇదిలా ఉంటే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ కు చెందిన నరేష్ విషయానికి వస్తే, డిగ్రీ వరకు చదువుకున్న నరేష్ తనకు ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయ పనులు చేస్తున్న తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. నరేష్ ముగ్గురు సోదరులు ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఇక నరేష్ కు మాత్రం ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే నరేష్ ఇంట్లో ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నకారణంగా, ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నరేష్ తండ్రి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలను రావద్దని విజ్ఞప్తి చేసినట్లుగా భావిస్తున్నారు.

 గత వారం మహబూబాబాద్ లో నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న షర్మిల

గత వారం మహబూబాబాద్ లో నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న షర్మిల

ఇక ఇదిలా ఉంటే గత మంగళవారం మహబూబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండలం గుండెంగ గ్రామంలో వైయస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహించారు. గుండెంగ గ్రామ సమీపంలోని సోమ్లా తండా లో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఆమె ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. నిరుద్యోగుల సమస్యలు తీర్చే వరకు సీఎం కేసీఆర్ పై సమరశంఖం పూరిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. ఉద్యోగాల కోసంతెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి నడిపించి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది విద్యార్థులని,7 ఏండ్ల తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం మరో ఉద్యమాన్ని మొదలు పెట్టింది వైఎస్సార్ టీపీ అంటూ పేర్కొన్నారు.

ఇప్పటికి ఏడు వారాలుగా పోరాటం .. వరుస ఇబ్బందుల మధ్య షర్మిల దీక్ష

ఇప్పటికి ఏడు వారాలుగా పోరాటం .. వరుస ఇబ్బందుల మధ్య షర్మిల దీక్ష

7 వారాలుగా నిరుద్యోగ నిరాహార దీక్షలతో నిరుద్యోగులపక్షాన నిలబడ్డామని వెల్లడించారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ నిరుద్యోగ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని, పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకు యువత పక్షాన నిలబడుతుంది అని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఇదే సమయంలో కెసిఆర్కు గుణపాఠం చెప్పాలంటే వచ్చే హుజురాబాద్ ఉప ఎన్నికలలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించి కెసిఆర్ మెడలు వంచి సార్ అని కూడా వైయస్సార్ తెలంగాణ పార్టీ నిర్ణయించిందని షర్మిల పేర్కొన్నారు. ఒకపక్క ఉద్యమాన్ని ఉధృతం చేయాలని షర్మిల భావిస్తుంటే, మరోపక్క ఊహించని పరిణామాలు, ప్రజల నుండి వ్యక్తమవుతున్న వ్యతిరేకత వైయస్ షర్మిలను ఇబ్బంది పెడుతున్నాయి.

 మొన్న ఇందిరా శోభన్ రాజీనామా

మొన్న ఇందిరా శోభన్ రాజీనామా

మొన్నటికి మొన్న వైయస్సార్ టీపీ స్థాపనలో కీలకంగా వ్యవహరించిన ఇందిరా శోభన్ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి షర్మిలకు షాక్ ఇచ్చారు. షర్మిల పార్టీ ప్రారంభించక ముందు నుండే కాంగ్రెస్ పార్టీని విడిచి, వైయస్ షర్మిల వెంట నడిచిన ఇందిరా శోభన్ ఊహించని విధంగా షర్మిల పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఆమె వైఎస్ షర్మిల స్వయంగా మాట్లాడినా సరే తన నిర్ణయాన్ని మార్చుకోలేదని సమాచారం .పార్టీ కోసం ఎంత పని చేస్తున్నా సరైన ప్రాధాన్యత దక్కకపోవడం కారణంగానే ఆమె రాజీనామా చేస్తున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.

Recommended Video

NTR ని TDP నుండి సస్పెండ్ చేసి.. ఇప్పుడు నాటకాలా.. Vijaysaireddy మాస్ ట్రోలింగ్ || Oneindia Telugu
అంతకు ముందు చేవెళ్ళ ప్రతాప్ రెడ్డి రాజీనామా

అంతకు ముందు చేవెళ్ళ ప్రతాప్ రెడ్డి రాజీనామా

అంతకుముందు షర్మిల పార్టీ కీలక నేత చేవెళ్ల ప్రతాప్రెడ్డి సైతం రాజీనామా చేశారు మహబూబ్ నగర్ జిల్లాకు ఇన్చార్జిగా వ్యవహరించిన ప్రతాపరెడ్డి పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగా రాజీనామా చేసి వైయస్ఆర్ తెలంగాణ పార్టీకి గుడ్ బై చెప్పారు. షర్మిల పార్టీలో ఉన్న కీలక నేత రాఘవ రెడ్డి వ్యవహార శైలికి నిరసనగా ఆయన తన రాజీనామాను ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించి చేవెళ్ల ప్రతాప్ రెడ్డి షర్మిలకు షాక్ ఇచ్చారు.

English summary
Sharmila will going to do an unemployment hunger strike tomorrow in Manchiryala district's Dandepalli mandal Lingapur. This time YS Sharmila received an unexpected shock. the father of the unemployed youth who is recently died has appealed to ys Sharmila not to come to their house for the protest. With this, the YSRTP leaders are in dilemma. Unemployed Naresh's father denied Sharmila's arrival to his home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X