ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొత్తకోణం; ఈడీ అనుబంధ చార్జ్ షీట్లలో షాకయ్యే పేర్లు!!
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మూడో చార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాఖలుచేసిన అనుబంధ చార్జిషీట్లను సోమవారం నాడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ చార్జిషీట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సంచలన అంశాలను ప్రస్తావించింది.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జిషీట్లో ఎమ్మెల్సీ కవితతో పాటు, ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ పేరును కూడా ఈడీ అధికారులు చేర్చారు. కవిత తో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్ర రెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్ళై లతో కూడిన సౌత్ గ్రూపు 100 కోట్లు ముడుపులు ఇచ్చారని ఈడీ తన చార్జిషీట్లో ప్రస్తావించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూపు కీలకంగా వ్యవహరించింది అని పేర్కొంది.

ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జ్ షీట్లలో రెండవ అదనపు చార్జిషీట్ లో మాగుంట రాఘవ తో సహా పలువురు పైన ఈడీ అభియోగాలు నమోదు చేసింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ లకు ప్రేమ్ రాహుల్ అనే వ్యక్తి బినామీగా ఉన్నారని ఈడీ తన చార్జిషీట్లో పేర్కొంది. మూడో అదనపు చార్జిషీట్లలో అరుణ్ రామచంద్ర పిళ్ళై పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అభియోగాలు నమోదు చేసింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరుణ్ రామచంద్ర పిళ్లై ప్రతినిధిగా వ్యవహరించారని పేర్కొంది. లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో వారు హైదరాబాద్లో ఫీనిక్స్ సంస్థ పేరుతో భూములు కొన్నారని ఈడీ పేర్కొంది. ఫీనిక్స్ సంస్థకు సీఈవో గా పనిచేస్తున్న శ్రీహరి పేరును కూడా చార్జిషీట్లో పేర్కొన్నారు.
ఎన్ గ్రోత్ క్యాపిటల్ అనే కంపెనీ ద్వారా ఫీనిక్స్ గ్రూప్ నుండి కవిత స్థిరాస్తి ఉన్నట్టుగా కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వెల్లడించినట్టు ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. 25 వేల చదరపు అడుగుల ఆస్తిని ఫీనిక్స్ నుండి కవిత కొన్నట్టు పేర్కొంది. ఎన్ గ్రోత్ క్యాపిటల్ కంపెనీలో కవిత భర్త అనిల్ కూడా భాగస్వామ్యం ఉన్నట్టుగా ఈడీ చార్జిషీట్ లో సంచలన విజయాలను నమోదు చేసింది.












Click it and Unblock the Notifications