షాకింగ్ న్యూస్.. దేశంలోనే నాల్గవ స్థానం.. తెలంగాణాలో విజృంభిస్తున్న వ్యాధి!

దేశంలో ప్రస్తుతం డయాబెటిస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మారుతున్న జీవనశైలి విధానం కారణంగా దేశంలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అలాంటి వాటిలో డయాబెటిస్ ఒకటి. దేశవ్యాప్తంగా డయాబెటిస్ రోగాల సంఖ్య రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో తాజా గణాంకాలు దేశంలో ఏ ఏ రాష్ట్రాలలో అత్యధికంగా డయాబెటిస్ బాధితులు ఉన్నారు అన్న విషయాలను వెల్లడించాయి.

తెలంగాణా ప్రజలకు షాకింగ్ న్యూస్
ఈ క్రమంలో తెలంగాణా ప్రజలు షాక్ అయ్యే ఒక అధ్యయనం తాజాగా వెల్లడైంది. మధుమేహ బాధితుల సంఖ్య విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలలో నాలుగవ స్థానంలో నిలిచింది అని తాజా అధ్యయనం వెల్లడించింది. మధుమేహ వ్యాధి నిర్ధారణలో స్క్రీనింగ్ చేయించుకున్న వారిలో 14 శాతం మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తులుగా మారారని, తాజాగా లోక్సభ ప్రవేశపెట్టిన నివేదికలో వెల్లడైంది.

Shocking news Diabetes cases rise in Telangana stands 4th place in the country

దేశంలో మధుమేహ బాధితులలో నాలుగవ స్థానంలో తెలంగాణా
అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో 80.90 లక్షల మంది రోగులు మధుమేహ వ్యాధిగ్రస్తులుగా నివేదించగా, మహారాష్ట్రలో 40 లక్షల మంది కి పైగా మదిమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక రాష్ట్రంలో 28 లక్షల మంది మధుమేహరోగులు ఉన్నట్టు తేలింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం నవంబర్ వరకు 24. 5 లక్షల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందిస్తున్నట్టు తేలింది. ఇలా దేశంలో తెలంగాణా నాలుగవ స్థానంలో ఉంది.

తెలంగాణాలో డయాబెటిస్ వ్యాప్తికి కారణాలివే
తెలంగాణ జనాభాలో దాదాపు 40 శాతం మంది హైదరాబాద్ నగరంలోనూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోనూ నివసిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోనే అధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టుగా తేలింది. పట్టణీకరణ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్ ఇవి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రవేశించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సైతం మధుమేహం వ్యాప్తి పెరుగుతుంది

తెలంగాణాలో ఆందోళనకరంగా డయాబెటిస్
తెలంగాణ రాష్ట్రంలో 2019 మరియు 2021 మధ్య నిర్వహించిన తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రాష్ట్రంలోని పురుషులలో 13. 8 శాతం మరియు మహిళల్లో 10.2 శాతం మధుమేహ వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్టుగా వెల్లడించింది. ఇక తాజాగా మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరగటం ఆందోళన కలిగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+