కలకలం: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల వాట్సప్‌ గ్రూప్‌లో.. నీలిచిత్రాలు!

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ-జీహెచ్ఎంసీకి చెందిన కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్‌లో ఓ కార్పొరేటర్ నీలిచిత్రాలు పోస్ట్ చేసినట్లు సమాచారం. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైనది.

హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ-జీహెచ్ఎంసీకి చెందిన కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్‌లో ఓ కార్పొరేటర్ నీలిచిత్రాలు పోస్ట్ చేసినట్లు సమాచారం. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైనది.

వివరాల్లోకి వెళితే.. కార్పొరేటర్లందరూ ఉన్న వాట్సప్ గ్రూప్‌లోకి హైదరాబాద్ లోని వెంగళరావునగర్ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్ కిలారి మనోహర్ వాట్సాప్ నెంబర్ నుంచి నీలి చిత్రాలు అప్ లోడ్ అయినట్లు సమాచారం.

Shocking: Porn Films Uploaded into GHMC Official Whatsapp Group!

అధికారిక వాట్సప్ గ్రూప్‌లో నీలి చిత్రాలు రావడంతో శనివారం మహిళా కార్పొరేటర్లు మండిపడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే జీహెచ్ఎంసీకి చెందిన పెద్ద తలకాయలు ఈ విషయంలో జోక్యం చేసుకుని వివాదం పెద్దదవకుండా చూస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ పని తాను చేయలేదని, గతంలో తన వద్ద పనిచేసిన డ్రైవర్.. తాను ఉద్యోగం నుంచి తీసివేశాననే పగతో తనను అప్రతిష్టపాలు చేయడానికి ఈ పనిచేసినట్లుగా కార్పొరేటర్ కిలారి మనోహర్ వాపోయినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+