మంచిర్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరైనా చనిపోతే స్కూల్ కు సెలవొస్తుందని ..తోటి విద్యార్థినిపై హత్యాయత్నం చేసిన విద్యార్థినులు

|
Google Oneindia TeluguNews

సెలవు కోసం విద్యార్థులు చెయ్యకూడని పని చేశారు. ఎవరైనా చనిపోతే సెలవు వస్తుందని భావించి ఒక విద్యార్థినిని చంపేయాలని ప్రయత్నం చేశారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వయసులోనే ఇలా వక్ర బుద్ధులతో ఏకంగా హత్యాయత్నం చేసిన విద్యార్థినులతీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా షాక్ కు గురి చేస్తుంది .

చక్కగా చదువుకుని , విద్యాబుద్ధులు నేర్చుకుని, పైకి ఎదగవలసిన విద్యార్థినులు కేవలం సెలవుల కోసం మరో విద్యార్థినిని హత్య చేసేందుకు ప్రయత్నం చేశారు అంటే మన సమాజం ఎటువైపు పయనిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

విద్యర్తినుల్లో నేరప్రవృత్తి పెరగటానికి సీరియళ్ళు, సినిమాలే కారణం

విద్యర్తినుల్లో నేరప్రవృత్తి పెరగటానికి సీరియళ్ళు, సినిమాలే కారణం

విద్యార్థినులు ఈ తరహా ప్రయత్నం చేయడానికి ప్రధాన కారణం సీరియల్స్, సినిమాలు అని చెప్పక తప్పని పరిస్థితి. చిన్నారులను సైతం విలన్స్ గా చిత్రీకరిస్తున్న సీరియల్స్ ను చూస్తున్న చిన్నారుల మనసులో అలాంటి ప్రవృత్తి పెరుగుతోంది. ఫలితంగా సీరియల్ తరహాలో సెలవు కోసం ఒక విద్యార్థినిని హతమార్చే యత్నం చేశారు ముగ్గురు విద్యార్థినులు.

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ దారుణం విషయానికి వస్తే స్కూలుకు సెలవుల కోసం తోటి విద్యార్థినిని హత్య చేసేందుకు కొందరు విద్యార్థినులు ప్రయత్నించడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ విషయం తెలిసిన పాఠశాల ఉపాధ్యాయులను నివ్వెరపోయేలా చేసింది.

సెలవు కోసం సహా విద్యార్థిని గొంతు నులిమి చంపే యత్నం చేసిన ముగ్గురు బాలికలు

సెలవు కోసం సహా విద్యార్థిని గొంతు నులిమి చంపే యత్నం చేసిన ముగ్గురు బాలికలు

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో ఉన్న కస్తూర్బా ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ముగ్గురు సెలవుల కోసం వక్ర బుద్ధితో ఆలోచించారు. ఎవరైనా విద్యార్థినిని చంపేస్తే స్కూలుకు సెలవులు వస్తాయని భావించిన వారు ఇందుకోసం రమాదేవి అనే స్నేహితురాలిని ఎంచుకున్నారు. ముగ్గురూ కలిసి ప్లాన్ చేసి రమాదేవిని హతమార్చాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో రమాదేవి గట్టిగా కేకలు వేసింది. దీంతో విద్యార్థినులు ఆమెను అక్కడే వదిలి పెట్టి పరారయ్యారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ విద్యార్థినులను పిలిచి మందలించారు .

బాలనేరస్తులుగా జువైనల్ హోం కు విద్యార్థినులు ...

బాలనేరస్తులుగా జువైనల్ హోం కు విద్యార్థినులు ...

పాఠశాలకు సెలవు వస్తే ఆడుకోవచ్చని భావించిన ముగ్గురు విద్యార్థులు లంబడిపల్లి గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్నరమాదేవి(12) అనే విద్యార్థిపై హత్యాయత్నం చేసి అనవసరంగా బాల నేరస్తులుగా మారారు . రమాదేవిని హతమార్చటానికి యత్నించే క్రమంలో ఆమె గొంతు నులిమారు . ఇక ఆ బాలిక కేకలు వేయడంతో అందరూ మేలుకొని వారి నుంచి రమాదేవిని రక్షించారు. పాఠశాల ఉపాధ్యాయుల, రమాదేవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం చేసిన విద్యార్థులు పూజా, శ్రీలేఖ, నిందినిలపై కేసు నమోదు చేసి వారిని జువైనల్ హోంకు తరలించారు.

English summary
Kasturba Ashram school in Chennur in the district of mancherial Students tried to murder her class mate for the sake of holidays. Whoever thinks that if someone kills a student, the holidays to school, they chose a friend named Ramadevi. Ramadevi shouted loudly as the three tried to plan together and assassinate Ramadevi. They slammed her throat in an attempt to assassinate Ramadevi. The girl shouted and everyone was awake and saved Ramadevi from them. On the complaint of school teachers and parents of Ramadevi, the police assassinated the students and brought them to Juvenile Home, registering a case against Pooja, Sreelekha and the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X