అమ్నీషియా పబ్ అత్యాచారకేసులో షాకింగ్ విషయాలు .. పబ్ లోకి వెళ్ళేముందే కార్లో కండోమ్ ప్యాకెట్లు!!
జూబ్లీహిల్స్ ఆమ్నీషియా పబ్ మైనర్ బాలిక అత్యాచార కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ప్రీ ప్లాన్డ్ అని పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో క్రైమ్ సీన్ ను రీ కన్స్ట్రక్షన్
అమ్నీషియా పబ్ కేసులో ప్రధాన నిందితుడైన సాదుద్దీన్ ను కస్టడీకి తీసుకున్న పోలీసులు అతనిని విచారించారు. అత్యాచార కేసులో నిందితులుగా ఉన్న మైనర్ల తో పాటు సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు విచారించారు. ఈ కేసులో కస్టడీకి తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు, పక్క జిల్లా కార్పొరేటర్ కుమారుడు తో సహా ఐదుగురు మైనర్ లతో పోలీసులు ఆదివారం క్రైమ్ సీన్ ను రీ కన్స్ట్రక్షన్ చేశారు.

బాలికపై అత్యాచారం జరిగిన తీరుపై విచారణ
ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పబ్, కాన్సు బేకరీ, రోడ్ నెంబర్ 44 లోని పవర్ స్టేషన్, తిరిగి పబ్ మధ్య వారిని తిప్పుతూ రకరకాలుగా ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు పబ్ కు ఎవరెవరు వచ్చారు? పబ్ నుంచి కారులో ఎవరెవరు వెళ్లారు? ఆరోజు బాధిత బాలిక ఏ కారులో కూర్చుంది? ఆమెపై ఏయే ప్రాంతాల్లో అత్యాచారం చేశారు? అన్న వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలన్నింటినీ రికార్డ్ చేసిన పోలీసులు నిందితుల నుండి కీలక విషయాన్ని రాబట్టారు.

పబ్ లోకి వెళ్ళక ముందే కారులో కండోమ్ ప్యాకెట్లు .. ముందే ప్లాన్
నిందితులు పబ్ లోకి వెళ్లే ముందే ఇన్నోవా, బెంజ్ కారులో కండోమ్ ప్యాకెట్లను తీసుకు వచ్చినట్టు గుర్తించారు. నిందితులు పోలీసుల ముందు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. రేప్ ఇంటెన్షన్ తోనే పబ్ కు వచ్చినట్టుగా పోలీసులు దానిని బట్టి నిర్ధారించారు. ఇదిలా ఉంటే సోమవారం నాడు ఈ కేసులో మరో సారి ఐదుగురు మైనర్ లను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. జువైనల్ హోం నుంచి వారిని నేరుగా జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలించి వారిని విచారించనున్నారు. ఇప్పటికే మైనర్లు సాదుద్దీన్ మాలిక్ రెచ్చగొట్టడం వల్లే తాము బాలికపై అత్యాచారం చేశామని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు.

సాదుద్దీన్ స్టేట్ మెంట్ లో కీలక విషయాలు .. మొదట అత్యాచారం చేసింది ఎమ్మెల్యే కుమారుడే
అయితే ముందుగా ఎమ్మెల్యే కుమారుడే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సాదుద్దీన్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ చంచల్గూడ జైలులో, మైనర్లు జువైనల్ హోమ్ లో ఉండడంవల్ల ఈ కేసులో రెండు వేరు వేరు కోర్టులలో కేసు విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్, మిగతా 5 మైనర్ లను బాలిక గుర్తించి కన్ఫామ్ చేయాల్సిన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ రెండుసార్లు వేర్వేరు ప్రాంతాలలో చేయించాల్సి రావడం అనివార్యంగా మారింది.

మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు... రెండు కోర్టులలో విచారణ
రెండు కోర్టులలో కేసు విచారణ జరుగుతుండడం దీనికి ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి అత్యాచారానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలన్నది ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. ఈ క్రమంలోనే పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నట్టు సమాచారం.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications