ఆమ్నీషియా పబ్ మైనర్ అత్యాచార కేసులో కీలకమలుపు: ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు
ఆమ్నీషియా పబ్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం కాస్త రాజకీయ దుమారం రేపింది. ఇక తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు చెయ్యటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. అమ్నీషియా పబ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.

రఘునందన్ రావుపై కేసు నమోదు
బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆమ్నీషియా పబ్ మైనర్ బాలిక అత్యాచారం కేసు విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీని, ఎంఐఎం పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఓ అడుగు ముందుకు వేసి కారులో అత్యాచారానికి సంబంధించిన వీడియోను, ఫోటోలను మీడియాకు చూపించారు. దీంతో రఘునందన్ రావు మైనర్ల ఫోటోలను, వీడియోలను చూపించారని మొదలైన రగడ ఆయనపై కేసు నమోదు చేసే దాకా వెళ్ళింది.

అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో రఘునందన్ రావుపై కేసు
ఎమ్మెల్యే రఘునందన్ రావు పై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడం పై చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసు నమోదు చేసినట్లు ఆబిడ్స్ పోలీసులు వెల్లడించారు. ఈమేరకు ఐపీసీ సెక్షన్ 228ఏ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అబిడ్స్ పోలీసులు వెల్లడించారు. వారం రోజుల క్రితమే రఘునందన్ రావు పై తనను దూషించి, నిర్బంధించారని గణపతి షుగర్స్ జిఎం ఫిర్యాదు చేయడంతో సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో రఘునందన్ రావుపై మరో కేసు నమోదైంది.

తనపై కేసులు పెట్టినా భయపడనన్న రఘునందన్ రావు
ఇప్పటికే రఘునందన్ రావు బాలికపై సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. మైనర్ బాలిక ఫోటోలు, వీడియోలు ఎలా రిలీజ్ చేస్తారంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంఐఎం నేతలు రఘునందన్ రావు ను టార్గెట్ చేస్తున్న క్రమంలో దీనిపై క్లారిటీ ఇచ్చిన ఆయన తాను వారి ముఖాలను చూపించలేదని, వారి పేర్లు బయట పెట్టలేదని తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు.

రఘునందన్ రావుపై కేసు నమోదుతో కేసులో కొత్త మలుపు
తనపై ఫోకస్ పెట్టే నాయకులు అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చెయ్యాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించటంపై ఫోకస్ చెయ్యాలని తేల్చి చెప్పారు. ఉడుత ఊపులకు భయపడేది లేదన్నారు. ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసుకోవచ్చని, బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని రఘునందన్ రావు స్పష్టం చేశారు. అయినప్పటికీ తాజాగా ఆయన పై కేసు నమోదు చేయడం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications