నగరంలో స్మశానవాటికల కొరత.!అధునీకరంచే దిశగా నగరపాలక సంస్ధ ప్రణాళికలు.!
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో నగరంలో ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా 46 కోట్ల రూపాయలతో మోడల్ స్మశాన వాటికల నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రిచిస్తోంది నగర పాలక సంస్థ.
దీంతో పాటు రెండు దశల్లో 33 మోడల్ స్మశాన వాటికల నిర్మాణాలు చేపట్టారు నగర పాలక అధికారులు. మొదటి దశలో 24.13కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 24 పనులు చేపట్టగా మొత్తానికి మొత్తం పూర్తయ్యాయని అధికారులు దృవీకరిస్తున్నారు. స్మశాన వాటికలకు ప్రహరీగోడ ఇతర మౌలిక వసతుల వంటి వాచ్ ఏరియా, బర్నింగ్ ప్లాట్ ఫాం, ప్రేయర్ హాల్ వెయిటింగ్ ఏరియా, సిట్టింగ్ గ్యాలరీ, పార్కింగ్ స్థలం, ఆఫీస్ స్థలం, అంత్యక్రియలకు సంబందించిన ఐటమ్స్ షాప్, లైటింగ్ ఇతర అవసరమైన వసతులు కల్పించారు. రెండో దశలో 21.77 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 9 పనులు చేపట్టగా అందులో 3 పనులు పూర్తి కాగా మిగితా పనులు వివిధ అభివృద్ది దశలో కొనసాగుతున్నట్టు అధికారులు స్పష్టం చేసారు. అసంపూర్తిగా ఉన్న పనులను నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేయాలని కూడా సిబ్బందికి అధికారులు అదేశాలు జారీ చేసారు.

అంతే కాకుండా నగర పాలకు సంస్థ నిరుపేద ప్రజల అవసరాలను గుర్తించి వారి కమ్యూనిటీ అవసరాల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మానాల కోసం 34కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 14 పనులను చేపట్టిందని నగర పాలక సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. బేగంపేట సర్కిల్ లో బన్సిలాల్ పేట్, బోయాగుడ పోలీస్ స్టేషన్ ప్రక్కన, నెహ్రూ నగర్ పార్క్ మారేడు పల్లి, పఠాన్ చెరువు సర్కిల్ లో చైతన్య నగర్, సికింద్రాబాద్ సర్కిల్ లో సీతాఫల్ మండి టి.ఆర్.టి క్వాటర్స్, ఎల్.బి నగర్ సర్కిల్ పరిధిలో గాంధీ విగ్రహం వద్ద, గాంధీ నగర్ రామంతపూర్ గాంధీ నగర్ 4 ఫేస్, కె.పి.హెచ్.బీ కాలనీ గాజులరామారం మొత్తం 8 పనులను 23.73 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసినట్టు అధికారుల పేర్కొన్నారు. మిగితా 2పనులలో అదనపు పనులు పూర్తి చేయాల్సి ఉంది. మిగితా 4 పనులు వివిధ ప్రగతి దశలో ఉన్నాయి. ఈ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లకు పూర్తి అధునాతన వసతులు కల్పించినట్టు నగర పాలక అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications