Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా యూనివర్సిటీలలో అధ్యాపకుల కొరత; 3వేలకు పైగా ఖాళీలు, భర్తీకై ఎదురుచూపులు

తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ఉన్నత విద్య ప్రమాణాలతో అత్యుత్తమ విద్యాబోధన కొనసాగించాల్సిన యూనివర్సిటీలు ఫ్యాకల్టీ లేమితో సతమతమవుతున్నాయి.అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో యూనివర్సిటీలలో విద్యాప్రమాణాలు దిగజారిపోతున్నాయి. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కమిటీ (NAAC) A+ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ, కొన్ని విశ్వవిద్యాలయాలు తగినంత ఫ్యాకల్టీ లేని కారణంగా ఇబ్బందుల మధ్య నడుస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలతో సహా 3000 కంటే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

తెలంగాణా ఏర్పాటైన నాటి నుండి అధ్యాపక నియామకాలు లేని యూనివర్సిటీలు

తెలంగాణా ఏర్పాటైన నాటి నుండి అధ్యాపక నియామకాలు లేని యూనివర్సిటీలు

ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు వంటి యూనివర్శిటీలు తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఎలాంటి నియామకాలు చేపట్టకపోవడంతో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఆయా యూనివర్సిటీలలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఉదాహరణకు కాకతీయ యూనివర్సిటీని చూస్తే 351 మంది ఆమోదం పొందిన అధ్యాపకుల్లో 102 మందితో మాత్రమే కాకతీయ యూనివర్సిటీ నడుస్తోంది.

మిగతావారంతా రిటైర్ కాగా, ఆ స్థానంలో కొత్త వారిని నియమించలేదు.ఆమోదించబడిన 1051 పోస్టుల భర్తీకి విశ్వవిద్యాలయాలు అనుమతి పొందాయి. అయితే ఈ ప్రతిపాదన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) పరిశీలనలో ఉంది.

త్వరలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ .. అధ్యాపక నియామకాలకు కసరత్తు

త్వరలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ .. అధ్యాపక నియామకాలకు కసరత్తు

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ ఉద్యోగ నియామకాల కోసం కసరత్తు చేస్తోంది. త్వరలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET)ని నిర్వహించాలని భావిస్తోంది. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు యూనివర్సిటీలో నియామకం పొందేందుకు అర్హులు . అయితే, రాష్ట్రంలో 2014 తర్వాత ఎలాంటి సెట్ నిర్వహించలేదు.

నెట్‌లో అర్హత సాధించిన వేలాది మంది అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉత్తీర్ణులైనవారు లేదా పీహెచ్డీ చేసిన అభ్యర్థులు అర్హులు.

సెట్ ప్రతిపాదనను సెక్రటరీకి పంపినట్లు చెప్పిన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్

సెట్ ప్రతిపాదనను సెక్రటరీకి పంపినట్లు చెప్పిన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్

యూనివర్సిటీలలో పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో నిర్వహించాలనుకుంటున్న సెట్ ప్రతిపాదనను సెక్రటరీకి పంపినట్లు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచనలను అనుసరించి సెట్ నిర్వహించడానికి విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు.

ఇదిలా ఉంటే అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో నమోదులు పెరిగాయని, అధ్యాపకుల కొరత కారణంగా విద్యా వ్యవస్థలో పురోగతి లేదని, యూనివర్సిటీలలో ప్రతికూల ప్రభావం కనిపిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గణాంకాలు చూపిస్తున్నాయి.

అధ్యాపకుల భర్తీ కోసం నిరీక్షణలో నిరుద్యోగులు

అధ్యాపకుల భర్తీ కోసం నిరీక్షణలో నిరుద్యోగులు

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయిన తరువాత నిరుద్యోగ యువత తమకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఇక ఉద్యమానికి ఊపిరి పోసిన యూనివర్సిటీలలో కూడా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని భావించారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు యూనివర్సిటీలపై తెలంగాణ ప్రభుత్వం చిన్న చూపు చూపిస్తూనే ఉంది.

Recommended Video

    సీఎం కేసీఆర్ పై మండి పడ్డ ఉస్మానియా యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు!! || Oneindia Telugu
    ప్రైవేట్ యూనివర్సిటీల వైపు మొగ్గు చూపిన తెలంగాణా సర్కార్ .. జాప్యం అందుకేనా?

    ప్రైవేట్ యూనివర్సిటీల వైపు మొగ్గు చూపిన తెలంగాణా సర్కార్ .. జాప్యం అందుకేనా?

    ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుని, ప్రస్తుతమున్న యూనివర్సిటీలు నీరుగారి పోయేలా అనేక ప్రయత్నాలు చేసింది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం అయ్యింది. ఇప్పటివరకు ప్రభుత్వం యూనివర్సిటీలలో అధ్యాపకుల భర్తీపై దృష్టిసారించకుండా తాత్సారం చేసింది. ఇక ప్రస్తుతం యూనివర్సిటీలలో బోధన సిబ్బందిని, బోధనేతర సిబ్బందికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతున్నప్పటికీ అది ఎప్పటి వరకు సాధ్యమవుతుంది అన్నది అర్థం కాని ప్రశ్నగానే ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+