వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రవణ్ కు బడా నేతలతో సంబంధాలు, హ్యుమన్ రైట్స్ ను ఆశ్రయించనున్న ఎస్ఐ కుటుంసభ్యులు

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో ఎ 1 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ కు రాజకీయనేపథ్యం కూడ ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఎన్ ఎస్ యూ ఐ లో పనిచేశారని సమాచారం. అంతేకాదు శ్రవణ్ కు పలువురు నేత

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో ఎ 1 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ కు రాజకీయనేపథ్యం కూడ ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఎన్ ఎస్ యూ ఐ లో పనిచేశారని సమాచారం. అంతేకాదు శ్రవణ్ కు పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి.

బ్యూటీషీయన్ శిరీష, రాజీవ్ , తేజస్విని మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించే పేరుతో శ్రవణ్ కుట్రపూరితంగా వ్యవహరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే పోలీసులు శ్రవణ్ కుమార్ ను ఈ కేసులో ఏ 1 నిందితుడిగా చేర్చాల్సి వచ్చిందని హైద్రాబాద్ సిపి మహేందర్ రెడ్డి ప్రకటించారు.

నల్లగొండ జిల్లాకు చెందిన శ్రవణ్ కు ఆ జిల్లాకు చెందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. శ్రవణ్ తండ్రి కాంట్రాక్టర్ గా ఉన్నారు. అయితే కొంతకాలంపాటు శ్రవణ్ తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నాడు. ఆ సమయంలోనే ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డితో శ్రవణ్ కు సంబంధాలు ఏర్పడ్డాయని అంటున్నారు.

రాజకీయాలతో సంబంధాలు

రాజకీయాలతో సంబంధాలు

శ్రవణ్ కు రాజకీయాలతో సంబంధాలున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయనకు సంబంధాలున్నట్టు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం అతను హైద్రాబాద్ లో ఎస్ ఐ కోచింగ్ తీసుకొంటున్నాడు. అయితే తాను అనుకొన్న పనిని చేసేందుకుగాను శ్రవణ్ ఎంతవరకైనా వెళ్ళేవాడని ఆయన గురించి తెలిసినవారు చెబుతున్నారు.

ప్రభాకర్ రెడ్డిది అలాంటి మనస్థత్వం కాదు

ప్రభాకర్ రెడ్డిది అలాంటి మనస్థత్వం కాదు

ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డిది హత్యేనని అంటున్నారు కుటుంబసభ్యులు.ప్రభాకర్ రెడ్డిని హత్య చేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి శిరీషపై లైంగికదాడికి ప్రయత్నించారనే ఆరోపణలు సరైందికాదన్నారు ప్రభాకర్ రెడ్డి సతీమణి రచన.కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేసే సమయంలో మహిళలను వేదించేవారిని ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా కొట్టేవాడని రచన గుర్తుచేసుకొన్నారు.భార్య ఉండగానే ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకొనేవారిని కఠినంగా శిక్షించేవాడని ఆమె చెప్పారు. శిరీష ఆత్మహత్య కేసుతో ప్రభాకర్ రెడ్డి కేసును లింక్ చేసి తప్పుదోవపట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.

రైటర్ శ్రీనివాస్ రెడ్డి నోరు తెరవాలి

రైటర్ శ్రీనివాస్ రెడ్డి నోరు తెరవాలి

కుకునూర్ పల్లి శ్రీనివాస్ రెడ్డి నోరు తెరిచి వాస్తవాలను బయటపెట్టాలని ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తల్లి కోరారు. ప్రభాకర్ రెడ్డిని హత్య చేశారని ఆమె ఆరోపించారు. ఉన్నతాధికారులు వేధించేవారని తనతో కూడ చెప్పారన్నారు. ప్రభాకర్ రెడ్డి చనిపోవడానికి అసలు వాస్తవాలు ఏమిటో శ్రీనివాస్ రెడ్డి బయటపెట్టాలని ఆమె కోరారు.ప్రభాకర్ రెడ్డి చనిపోయిన విషయాన్ని తమకు ఎందుకు పోలీసు అధికారులు సమాచారం ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే తాను సంఘటనస్థలానికి చేరుకొన్నట్టు ఆమె గుర్తుచేసుకొన్నారు.

హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాం

హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాం

ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి మృతి విషయంలో అనేక అనుమానాలున్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే విషయమై మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించనున్నట్టు వారు చెప్పారు. ప్రభాకర్ రెడ్డి మృతి విషయంలో అనుమానాలున్నాయని వారు మొదటినుండి చెబుతున్నారు. తొలుత ఎవరో కాల్చేశారని, తర్వాత ఆత్మహత్య చేసుకొన్నారని తనకు చెప్పారని ప్రభాకర్ రెడ్డి తల్లి మీడియాకు చెప్పారు. ఈ విషయమై అసలు వాస్తవాలను బయటపెట్టాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. అంతేకాదు ప్రభాకర్ రెడ్డి చనిపోతే తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని తల్లి ప్రశ్నించారు. అనేక అనుమానాలున్నందున హక్కుల సంఘాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు ప్రభాకర్ రెడ్డి సోదరులు.

English summary
Sravan Kumar, A 1 accused in beautician Sirisha suicide case.he has realtionship with several political leaders. Si Prabhakar Reddy family members planning to approach humanrights commission .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X