Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఏసీపీ వీరంగం! (వీడియో)

హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించకుండా వారిపై ఓ పోలీసు ఉన్నతాధికారి చిందులు తొక్కారు. తాను ఉన్నతాధికారినంటూ తమను తనిఖీ చేయవద్దని కేకలు వేశారు. దీంతో పోలీసు అధికారులు ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్​ సహా మరో ముగ్గురు మంగళవారం రాత్రి సఫారీ కారులో అమీర్‌​పేట నుంచి ఎస్ఆర్​ నగర్ వైపునకు వెళ్లారు. అక్కడ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండటాన్ని గమనించారు.

Siddipet ACP Suman Kumar s misbehavior against policemen who are conducting drunk and drive

వెంటనే తాగి డ్రైవింగ్ చేస్తున్న కారు డ్రైవర్​ వాహనాన్ని పక్కకు ఆపి తన సీటు నుంచి కిందకు దిగి వెనకాల సీటులోకి వెళ్లాడు. వెనకున్న వ్యక్తి డ్రైవింగ్ సీట్లోకి మారాడు. అయితే, అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కావేరి ఇదంతా గమనించింది. వెనక సీట్లోని వ్యక్తి డ్రైవింగ్ చేశాడని ఆమె అక్కడున్న పోలీసు అధికారులకు చెప్పారు. తనిఖీల్లో భాగంగా వారి కారును ఆపి వెనుక కూర్చున్న డ్రైవర్​‌ను బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు యత్నించారు.

అంతలో కారులోని వ్యక్తి కిందకు దిగి తాను సిద్ధిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అని, తమ కారు వదిలేయాలని తనిఖీ చేస్తున్న పోలీసులను హెచ్చరించాడు. కారు నడిపిన జైపాల్ రెడ్డిని వదిలేయాలని గట్టిగా కేకలు వేశాడు.దీంతో బ్రీత్ అనలైజర్ పరీక్షకు డ్రైవర్ మొండికేశాడు. మరోవైపు, ఊదొద్దని అతనికి ఏసీపీ సుమన్ కుమార్ అడ్డుపడ్డాడు. అంతటితో ఆగకుండా అక్కడ తనిఖీలు చేసే కానిస్టేబుల్‌​ను ఏసీపీ సుమన్ కుమార్ తోసేశాడు.

కారు బానెట్ పై గుద్దుతూ దూషిస్తూ, హల్​చల్ చేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు సుమన్ కుమార్. దీంతో ట్రాఫిక్​ పోలీసులు మధురానగర్ పోలీసులకు సమాచారం అందించారు. కారు నడిపిన జైపాల్ రెడ్డిని పోలీస్ స్టేషన్‌​కు తరలించి బ్రీత్ అనలైజర్ పరీక్షించగా మద్యం తాగినట్లు తేలింది.
మోతాదుకు మించి 39 పాయింట్లుగా నమోదైంది.


డ్రైవింగ్ చేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని, అతడు అల్వాల్‌​కు చెందిన వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, కారు నడిపిన జైపాల్ రెడ్డి, వారితో పాటు ఉన్న శ్రీనివాస్, వెంకట్ రావులపై ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఎస్సై కాంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారందరినీ అరెస్ట్ చేసినట్లు మధురానగర్ పోలీసులు తెలిపారు. కాగా, ఏసీపీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు అధికారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల పోలీసు అధికారి అయి ఉండి ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+