సిద్ధిపేట జిల్లాలో ఒక్క ఎకరం వరి సాగు చేసినా ఒక్కొక్కరిని వేటాడుతా: అధికారులకు సిద్ధిపేట కలెక్టర్ వార్నింగ్
సిద్దిపేట జిల్లా కలెక్టర్ వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఒక్క ఎకరంలో వరి సాగు చేసినా, ఆ పరిధిలో వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. అగ్రికల్చర్ మీటింగ్ లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జిల్లాలో వరి విత్తనాలు అమ్మే హక్కు ఎవరికీ లేదన్నారు.

ఒక్క ఎకరం వరి సాగు చేసినా సహించేది లేదు
సిద్దిపేట జిల్లాలో ఒక ఎకరం వరి సాగు చేసినా సహించేది లేదని తేల్చి చెప్పిన ఆయన తమ నిర్ణయంపై జీవోలు ఏవి ఉండబోవని, ఇది తన హుకుం అంటూ పేర్కొన్నారు. తాను కలెక్టర్ గా ఉన్నన్ని రోజులు ఇది అమలవుతుంది అంటూ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరైనా విత్తనం విక్రయదారులు వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా అంటూ హెచ్చరించారు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి.

వరి విత్తనాలు అమ్మే హక్కు ఎవరికీ లేదు
వరి విత్తనాలు అమ్మే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పిన ఆయన ఈ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఒక కేజీ వరి విత్తనాలు అమ్మినా సరే ఆ షాప్ లైసెన్స్ రద్దు చేస్తామని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రజలను చైతన్యం చెయ్యాలని, ప్రత్యామ్నాయ పంటలు వేసేలా చూడాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రెవెన్యూ అధికారులు,వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన సరఫరా చేసే డీలర్లు పాల్గొన్నారు.

వరి విత్తనాలు అమ్మితే అగ్రికల్చర్ ఆఫీసర్ లను సస్పెండ్ చేస్తాం
ప్రత్యామ్నాయ పంటలను వేసేలా రైతులను ప్రోత్సహించాలని, లేదా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిలో చైతన్యం తీసుకురావాలని చెప్పటంలో తప్పు లేదు కానీ రైతులు సాగు చేసే పంటలను శాసించేలా అధికారులు నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రామి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వారంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. యాసంగిలో వరి పంట వేయడం మంచిది కాదంటూ పేర్కొన్న కలెక్టర్ వెంకట్రామి రెడ్డి షాపులలో కిలో వరి విత్తనాలు అమ్మినా అగ్రికల్చర్ ఆఫీసర్ ను సస్పెండ్ చేస్తామని తేల్చి చెప్పారు.
వరి బదులు మంచి దిగుబడి వచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతాంగం దృష్టి పెట్టాలని గతంలో ప్రభుత్వం కూడా అనేకమార్లు వెల్లడించింది.కానీ రైతులు మాత్రం ఎక్కువగా వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో రైతులు వరి వెయ్యకుండా చూడాలని కలెక్టర్ చెప్పారు. నిర్బంధ వ్యవసాయాన్ని చేయించేలా కలెక్టర్ వ్యాఖ్యలు ఉండటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

గతంలో సీఎం కాళ్ళకు మొక్కి వివాదాల్లో నిలిచినా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి
గతంలో కూడా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వివాదంలో నిలిచారు. కలెక్టర్ పి.వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాదాలను తాకి అసాధారణ ప్రవర్తనను కనబరిచారు. దుద్దెడలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన సమయంలో వెంకటరామిరెడ్డిని తన ఛాంబర్‌కు తీసుకెళ్లి సీటులో కూర్చోబెట్టారు. ఆ వెంటనే వెంకట్రామి రెడ్డి తన సతీమణి, కుమారుడితో కలిసి ముఖ్యమంత్రి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కలెక్టర్ సీఎం కాళ్లకు నమస్కరించడం పట్ల అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications