నమ్మించి బైక్ ఎక్కించుకుని అత్తపై అల్లుడి అత్యాచారం
సిద్ధిపేట: కన్న కొడుకులా చూసుకునే అత్తపైనే కన్నేసిన ఓ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాు. ఈ సంఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందాపురంలో జరిగింది. అయితే, సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బాధితురాలి భర్త ఏడాది క్రితం మరణించాడు. దీంతో కూలి పనులు చేస్తూ కుమారుడికి చేదోడువాదోడుగా ఉంటూ వస్తోంది. గురువారం ఆమె శేర్‌బండారంలో కూలీ పనిచేసేందుకు వెళ్లింది. పని పూర్తి కాగానే ఇంటికి తీసుకుని వెళ్లాల్సిందిగా కొడుక్కి ఫోన్ చేసి చెప్పింది.

అయితే, అదే గ్రామంలో తన కూతురు భర్త ఉన్నాడని తెలిసి అతనికి ఫోన్ చేసింది. తాను అల్లుడితో వస్తానని చెప్పి కుమారుడికి చెప్పి అల్లుడి బైక్‌పై ఎక్కింది. అయితే, అతను ఆమెను మహ్మదాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాు.
ఆమె ప్రతిఘటించింది. అయితే, ఆమెను చితకబాది అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సాయంత్రం ఏడు గంటలకు ఇల్లు చేర్చాడు. అదే రోజు విషయాన్ని కుమారులకు చెప్పి దౌల్తాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి పంపించారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications