Harish Rao: కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేస్తోంది.. హరీశ్ రావు..
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గ్రూప్స్, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను హరీష్ రావు పరామర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్ తో మాట్లాడాలన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చ జరపాలన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నిరుద్యోగులు తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీశ్ రావు అన్నారు. ఎంతవరకైనా తెగించి కొట్లాడతామని చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందన్నారు. మోతిలాల్ నాయక్ దీక్ష విరమించాలని కోరారు. కలిసి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని పిలుపునిస్తున్నట్లు చెప్పారు. మోతీలాల్ కు ఏం జరగక ముందే ప్రభుత్వం తక్షణ స్పందించాలన్నారు.

అతని ఆరోగ్యం పట్ల ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. కోదండరాం గారు పిల్లల హక్కుల పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. అమలు చేసే విధంగా ముందుకు రావాలని కోరారు. మోతీలాల్ నాయక్ ఏడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇది నా ఒక్కడి పోరాటం కాదు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నట్లు మోతిలాల్ నాయక్ తెలిపారని హరీశ్ రావు మీడియాకు తెలిపారు.
ప్రభుత్వం దిగివచ్చేదాకా దీక్ష విరమించేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపెట్టి నిరుద్యోగులను వాడుకొని వదిలిపెట్టిందని హరీశ్ రావు అన్నారు. ఎన్నికలు అయిపోయాక నిరుద్యోగుల గుండెల మీద తన్నుతున్నారని విమర్శించారు. ఓడదాటే దాకా ఓడ మలన్న ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉందని దుయ్యబట్టారు. ఆనాడు నిరుద్యోగుల కోసం ప్రొఫెసర్ కోదండరాం , రియాజ్ , బాల్మ్యురి వెంకట్, మురళి , రేవంత్ రెడ్డి అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్లు చుట్ట తిరిగారని గుర్తు చేశారు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications