బీజేపీకి పెద్ద దిక్కు రామారావుకు ప్రముఖుల నివాళి (ఫోటోలు)
హైదరాబాద్: సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత వి. రామారావు(81) అనారోగ్యంతో మృతి చెందారు. కొద్ది కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ అపోలోలో నెల రోజులకుపైగా చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులు, హృద్రోగ సమస్యతో పాటు రక్తహీనతతో బాధపడుతున్నారు.
ఆయనను ఐసీయూలో ఉంచి న్యుమోనియా, బ్రాంకైటిస్, కరోనరీ అర్టరీ డీసీజ్, ఎనిమియా తదితర సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. 2002-2005 మధ్య కాలంలో సిక్కిం గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
ఆయనకు భార్య వసంత కుమారి, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో డిసెంబర్ 11, 1935లో రామారావు జన్మించారు. తండ్రి అప్పారావు హోమియో వైద్యుడు కావడంతో కొంత కాలం పాటు మండవల్లిలో ఉన్నారు. మచిలీపట్నంలో గ్రాడ్యుయేషన పూర్తయ్యాక హైదరాబాద్ ఉస్మానియాలో ఎల్‌ఎల్‌బీ చేశారు.

బీజేపీకి పెద్ద దిక్కు రామారావుకు ప్రముఖుల నివాళి
ఆ తర్వాత హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1956లో రాజకీయ జీవితం ప్రారంభించారు. 21 ఏళ్ల ప్రాయంలో 1956లో రామారావు జనసంఘ్‌లో చేరారు.

బీజేపీకి పెద్ద దిక్కు రామారావుకు ప్రముఖుల నివాళి
తెలుగు రాష్ట్రాల్లో సంఘ్ విస్తరణకు కృషి చేశారు. జన సంఘ్ పేరుని 1980లో భారతీయ జనతాపార్టీగా మార్చగా, అనంతరం బీజేపీలో చేరారు.

బీజేపీకి పెద్ద దిక్కు రామారావుకు ప్రముఖుల నివాళి
1966, 1972, 1978, 1984 కాలంలో హైదరాబాద్ పట్టభధ్రుల నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్, దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా వ్యవహరించారు.

బీజేపీకి పెద్ద దిక్కు రామారావుకు ప్రముఖుల నివాళి
1993, 2001లో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2002, 2007లో జాతీయ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

బీజేపీకి పెద్ద దిక్కు రామారావుకు ప్రముఖుల నివాళి
సోమవారం ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 12 వరకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచుతారు.
బీజేపీకి పెద్ద దిక్కు రామారావుకు ప్రముఖుల నివాళి
సోమవారం ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 12 వరకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచుతారు.

బీజేపీకి పెద్ద దిక్కు రామారావుకు ప్రముఖుల నివాళి
అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.

బీజేపీకి పెద్ద దిక్కు రామారావుకు ప్రముఖుల నివాళి
కాగా, బీజేపీ సీనియర్ నేత రామారావు కన్నుమూశారన్న వార్త తెలియగానే మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, భాజపా నేతలు కిషన్‌రెడ్డి, రామచంద్రరావు, బద్దం బాల్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ నేత జానారెడ్డి, టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications