ఫిర్యాదు: జానపద గాయకుడు ఆమెను రేప్ చేశాడు, మూడుసార్లు అబార్షన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఓ గాయనిపై అత్యాచారం చేసి ఆమెను మోసం చేశాడనే ఆరోపణపై ఎద్దుల జంగారెడ్డి అనే జానపద గాయకుడిపై కేసు నమోదైంది. ఈ మేరకు 27 ఏళ్ల వయసు గల ఆ గాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె రెడ్డి బృందం పనిచేస్తూ ఉండేది.

జంగారెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో లైంగిక సంబంధం నెరిపాడని, అంతేకాకుండా మూడు సార్లు గర్భం దాలిస్తే అబార్షన్ చేయించుకునేలా ఒత్తిడి చేశాడని ఆమె హైదరాబాదులోని గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన భర్తకు అప్పటికే విడాకులు ఇచ్చింది.

Rape-victim

భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత బాధితురాలు జంగారెడ్డి బృందంలో చేరింది. పెళ్లి చేసుకుంటానని జంగారెడ్డి నమ్మించినట్లు, అంతేకాకుండా మంచి భవిష్యత్తు ఇస్తానని కూడా హామీ ఇచ్చినట్లు ఆమె ఆరోపిస్తోంది. తనపై జంగారెడ్డి ఎన్నో మార్లు లైంగికంగా దాడి చేశాడని ఆమె ఆరోపించింది.

పెళ్లి చేసుకోవాలని తాను ఒత్తిడి తేవడంతో తనకు జంగారెడ్డి దూరమవుతూ వచ్చాడని ఆమె ఆరోపించింది. జంగారెడ్డిని అరెస్టు చేయాలని, లేదంటే విదేశాలకు పారిపోతాడని ఆమె చెప్పింది. దాంతో ఎద్దుల జంగారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Folk singer Yeddula Janga Reddy was booked for allegedly raping and cheating a 27-year-old singer in Hyderabad.
Please Wait while comments are loading...