మే1 నుంచి సినిమా థియేటర్ల బంద్..!?
తెలంగాణ సినిమా థియేటర్ల వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో, ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయానికి సిద్ధమయ్యారు. మే 1 నుంచి థియేటర్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక ప్రకటన చేసింది. మల్టీప్లెక్స్ ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సంటేజీ విధానంలో సినిమాలను ప్రదర్శించాల ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఇటీవల నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో మే 1 నుంచి థియేటర్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తామని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక ప్రకటన చేసింది. మల్టీప్లెక్స్ ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సంటేజీ విధానంలో సినిమాలను ప్రదర్శించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 450 సింగిల్ స్క్రీన్లు ఉండగా.. హైదరాబాద్ లో 150 కొనసాగుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సటేంజ్ విధానం తీసుకురావాలనేది వారి ప్రధాన డిమాండ్. అయితే ఈ విషయాన్ని నిర్మాతల గిల్డ్ వ్యతిరేకించింది. థియేటర్లకు పర్సంటేజీ ఇవ్వడం కుదరని స్పష్టం చేసింది.

థియేటర్ల మూసివేత తప్పదా..
పర్సెంటేజ్ విధానానికి అంగీకరించే డిస్ట్రిబ్యూటర్లతో మాత్రమే ఎగ్జిబిటర్లు పనిచేస్తారని తెలంగాణ కంట్రోలర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చెడుతోంది. ప్రస్తుత అద్దె విధానం వల్ల సింగిల్-స్క్రీన్ థియేటర్లు ఇబ్బందులు పడుతున్నాయని, వాటికి వసూళ్లలో సరైన వాటా అవసరమని స్పష్టం చేస్తోంది. ప్రతిపాదిత నమూనా ప్రకారం, పంపిణీదారులు, నిర్మాతలు మొదటి వారంలో 60 శాతం, రెండవ వారంలో 50 శాతం, మూడవ వారంలో 40 శాతం ఆదాయాన్ని పొందుతుండగా, మిగిలిన మొత్తాన్ని ఎగ్జిబిటర్లు ఉంచుకుంటారు.
భాగస్వాముల మధ్య చర్చల అనంతరం ఈ నమూనాను ఖరారు చేసినట్లు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. దీంతో.. ఇప్పుడు సమ్మెకు విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో ఈ అంశం లో ఎలాంటి నిర్ణయాలు వస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications