సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు పిల్లలు సజీవదహనం
వరంగల్: వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజయ్య విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి నిద్రపోతుండగా అగ్నిప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ అగ్నిప్రమాదంలో రాజయ్య కోడలు సారికతో సహా ముగ్గురు పిల్లలు అభినవ్, అయోన్, శ్రీయోన్‌లు సజీవ దహనమయ్యారు. గ్యాస్ లీకై అగ్నిప్రమాదం జరిగిందని అంటున్నారు.
కొద్దిరోజులుగా రాజయ్యకు ఆయన కోడలు సారికకు మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఈ విభేదాల నేపథ్యంలో కోడలు సారిక గ్యాస్ లీక్ చేసి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని రాజయ్య, ఆయన భార్య మాధవి పోలీసులకు సమాచారం అందించారు.

బుధవారం అర్భాటంగా నామినేషన్ వేసేందుకు సమాయత్తమవుతున్న రాజయ్య కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. షార్టుసర్క్యూట్ ఈ అగ్నిప్రమాదానికి కారణమని కూడా అంటన్నారు. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో రాజయ్య కుమారుడు అనిల్ ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. 2006లో సారికను రాజయ్య కుమారుడు అనిల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. తనను కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ సారిక గతంలో మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో రాజయ్య, ఆయన భార్య ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications