అవకాశం వస్తే శిరీషను..: శ్రవణ్ ఈ కేసులో అమాయకుడా, పేరెంట్స్ స్పందన

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో శ్రవణ్ ఏ1గా ఉన్నాడు. రాజీవ్ ఏ2గా ఉన్నాడు.దీనిపై ఏ1గా ఉన్న శ్రవణ్ తల్లిదండ్రులు ఓ టీవీ ఛానల్‌లో స్పందించారు.

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో శ్రవణ్ ఏ1గా ఉన్నాడు. రాజీవ్ ఏ2గా ఉన్నాడు. దీనిపై ఏ1గా ఉన్న శ్రవణ్ తల్లిదండ్రులు ఓ టీవీ ఛానల్‌లో స్పందించారు. తమ అబ్బాయి మంచివాడని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల బ్యూటిషియన్ శిరీష, కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డిల ఆత్మహత్యలు సంచనలం రేపిన విషయం తెలిసిందే. శిరీషతో శ్రవణ్‌కు కొన్నాళ్ల క్రితం పరిచయమైంది. శిరీషను శ్రవణ్ అదోలా మరో ఆలోచనతో చూసేవాడనే వాదనలు ఉన్నాయి.

అవకాశం వచ్చినప్పుడు..

అవకాశం వచ్చినప్పుడు..

శిరీష-రాజీవ్‌ల మధ్య వివాహేతర సంబంధముందని పోలీసులు ఇటీవల తేల్చారు. అయితే శ్రవణ్ కన్ను కూడా ఆమె పైన పడిందనే వాదనలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు శిరీషను ఉపయోగించుకోవాలనుకున్నాడని అంటారు.

దానిని అనుకూలంగా మలుచుకున్నాడని..

దానిని అనుకూలంగా మలుచుకున్నాడని..

అదే సమయంలో రాజీవ్ - శిరీషల మధ్య విభేదాలు వచ్చాయి. మధ్యలో తేజస్విని రావడంతో వారి మధ్య గొడవ జరిగింది. దీనిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని, శిరీషను ఉపయోగించుకోవాలని శ్రవణ్ భావించాడని అంటున్నారు. దీనిపై వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా అబ్బాయి చాలా మంచోడు

మా అబ్బాయి చాలా మంచోడు

తమ కొడుకు చాలా మంచివాడు అని శ్రవణ్ తల్లిదండ్రులు చెప్పారు. తమది మధ్య తరగతి కుటుంబమని, తమ కొడుకు విలాసాల గురించి తమకు తెలియదని చెప్పారు. శిరీష ఆత్మహత్యతో తమ కొడుకుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తమ కొడుకును ఇరికించారని ఆరోపించారు.

శిరీష

శిరీష

శిరీష కేసులో తన కొడుకు శ్రవణ్ ఏ1 నిందితుడు అని పేపర్లో, టీవీల్లో చూశామని అతని తండ్రి చెప్పారు. తన కొడుకు రోజు ఇక్కడే ఉంటాడని, ఇక్కడి నుంచే వెళ్తుంటాడని చెప్పారు. మీడియా వాస్తవాలు వెలికి తీయాలని విజ్ఞప్తి చేశారు. మీరు ఏమైనా చేయాలనుకుంటే తమకు సాయం చేయాలని అర్థించారు.

సంబంధం లేదు కాబట్టే

సంబంధం లేదు కాబట్టే

శిరీష కేసులో తన కొడుకుకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే మీడియా అడిగితే తనకు ఏం సంబంధం లేదని చెప్పాడని శ్రవణ్ తండ్రి అన్నారు. నేను కూడా అదే చెబుతున్నానని, తన కొడుకు తప్పు చేయలేదన్నారు. విచారణలో అన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని వెల్లడించారు.

మీకన్నీ తెలుసు

మీకన్నీ తెలుసు

మీకు (మీడియా)కు ప్రతి ఒక్కడి తెలుసునని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎంత న్యాయం చేయాలనుకుంటే మీరు అంత న్యాయం చేయాలన్నారు. తన బిడ్డది చిన్న తప్పు కూడా లేదన్నారు. మీకు నేను చెప్పాల్సింది చెప్పానని అన్నారు.

ఆధారాలు సేకరించడంపై..

ఆధారాలు సేకరించడంపై..

పోలీసులు ఆధారాలు సేకరించినట్లు చెప్పడం, టవర్ లొకేషన్ గురించి చెప్పడంపై తల్లి స్పందించారు. మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చేయాలని, మేం చేయలేదు అంటే చేసినట్లు కాదని, చేశామంటే చేసినట్లు కాదని, ఏం జరిగిందనేది అందరికీ తెలుస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+