శిరీషకు రాజీవ్‌తో అక్రమ సంబంధమా, కిరాణా షాప్ నడుపుకునేది'
బ్యూటీషియన్ శిరీష కేసులో మరో విషయం వెలుగు చూసింది. స్టూడియో ఓనర్ రాజీవ్‌కు, శిరీషకు మధ్య నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని చెప్పడం శుద్ధ అబద్ధమని ఆమె బాబాయి శ్రీనివాస రావు మరోసారి చెప్పారు.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష కేసులో మరో విషయం వెలుగు చూసింది. స్టూడియో ఓనర్ రాజీవ్‌కు, శిరీషకు మధ్య నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని చెప్పడం శుద్ధ అబద్ధమని ఆమె బాబాయి శ్రీనివాస రావు మరోసారి చెప్పారు.

నాలుగేళ్లుగా కలిసున్నారనేది అవాస్తవం
శిరీష - రాజీవ్‌లు నాలుగేళ్లుగా కలిసున్నారనేది, వివాహేతర సంబంధఁ ఉందనేది పూర్తిగా అబద్ధమని చెబుతున్నారు. హైదరాబాదులోని కృష్ణా నగర్‌లో శిరీష ఆరేళ్లుగా కిరాణా దుకాణం, బ్యూటీ పార్లర్ నడుపుతోందని వెల్లడించారు.

వేధింపుల్లేవు
శిరీష ఆత్మహత్య చేసుకునే రకం కాదని బాబాయి తెలిపారు. శిరీషకు అత్తింటి వేధింపులు కానీ లేక పుట్టింటి వేధింపులు కానీ లేవని తెలిపారు. ఆమెది కచ్చితంగా ఆత్మహత్యేనని చెప్పారు. తలపై బలంగా కొట్టడంతో ఆమె చనిపోయిందని తెలిపారు.

మొదటి నుంచి ఇదే..
శిరీషది ఆత్మహత్యేనని, గొడవకు కారణమైన తేజస్విని వివరాలు ఎందుకు బయటకు చెప్పడం లేదని ఇప్పటికే బాబాయి అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే శిరీషను పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లలేదని, పాంహౌస్ తీసుకు వెళ్లారని, రాజీవ్, శ్రవణ్, ఎస్సై.. ముగ్గురు కలిసి చంపేసి ఉంటారని అనుమానించారు. శిరీష చాలా ధైర్యవంతురాలని,ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని కుటుంబ సభ్యులు పదేపదే చెబుతున్నారు.

రోజు రోజుకు అనుమానాలు..
మరోవైపు, శిరీష మృతిపై అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. కుకునూరుపల్లిలో గ్రామస్తులు మళ్లీ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మరోవైపు, రాజీవ్, శ్రవణ్‌లను కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications