BRS: బీఆర్ఎస్ కు మరో షాక్.. పార్టీ వీడే యోచనలో కీలక నేత..!

బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాంబర్ కు వచ్చారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడారు. తమ కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.

బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు పెడుకోవడంపై కోనేరు కోనప్ప అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకో సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి కోనప్పపై పోటీ చేశారు.

Sirpur BRS leader Koneru Konappa is likely to join Congress

అయితే ఇక్కడే బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ విజయం సాధించారు. అయితే బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు భవిష్యత్తులో కూడా కొనసాగితే తనకు ఇబ్బంది అవుతుందని కోనప్ప భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు మంగళవారం కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

ఇక బీఆర్ఎస్ ఐదుగురురి పేర్లను ప్రకటించింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబాబాద్ నుంచి కవిత, ఖమ్మం నుంచి నామ నాగేశ్వర రావు, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి పేర్లను ప్రకటించారు. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవి లత, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, నాగర్ కర్నూలు నుంచి భరత్ పోటీ చేయనున్నారు.

ఇక బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్ రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+