నయీంతో సంబంధాలు: 12 మంది పోలీసు అధికారులపై చర్యలు? శేషన్న ఎక్కడ?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో పోలీసులపై తీవ్రమైన చర్యలకు 'సిట్' సిద్దమౌతోంది. బతికున్న సమయంలో నయీంతో సంబంధాలున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోనున్నారు.ఈ మేరకు రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకొనే అవకాశం కన్పిస్తోంది.మరో వైపు నయీం ముఖ్య అనుచరుడు శేషన్న ఎక్కడున్నాడనేది సిట్ ఇంకా గుర్తించలేదు.

గ్యాంగ్ స్టర్ నయీంతో సుమారు 12 మంది పోలీసుఅధికారులకు సంబంధాలున్నాయని సిట్ గుర్తించింది.నయీం చేసే అడ్గగోలు వ్యాపారాలు, హత్యలు, బెదిరింపులు, భూ కబ్జాల వంటి విషయాలు తెలిసినా ఈ పోలీసు అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించారని సిట్ గుర్తించింది.

అంతేకాదు కొందరు పోలీసు అదికారులు నయీంకు బినామీలుగా వ్యవహరించి తమ పేర్లతో ఆస్తులు కూడబెట్టుకొన్నారని కూడ సిట్ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది.

అయితే గ్యాంగ్ స్టర్ ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు కలిగిఉన్నారనే విషయమై సిట్ చిట్టాను తయారు చేసింది.ఈ మేరకు పోలీసు అధికారులను పిలిపించి మరీ విచారణ చేసింది.ఈ విచారణ తర్వాత నయీంతో ఎవరెవరు ఏ రకంగా వ్యవహరించారనే విషయమై ఓ నిర్థారణకు వచ్చింది సిట్.

నయీంతో సంబంధాలున్న అధికారులపై చర్యలు

నయీంతో సంబంధాలున్న అధికారులపై చర్యలు

గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధాలున్న పోలీసుల అదికారులపై చర్యలు తీసుకోవాలని సిట్ నిర్ణయానికి వచ్చింది.ఈ మేరకు గ్యాంగ్ స్టర్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చిన పోలీసు అధికారులను సిట్ విచారించింది. ఈ మేరకు నయీంతో అంటకాగిన పోలీసు అధికారులకు సంబందించిన ఆధారాలను సేకరించింది సిట్. ఈ ఆధారాల ప్రకారంగా నయీంతో సన్నిహితంగా మెలిగిన పోలీసులపై చర్యలు తీసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.

12 మందిపై వేటేనా?

12 మందిపై వేటేనా?

గ్యాంగ్ స్టర్ నయీం కార్యకలాపాలతో సంబంధాలున్నాయని 12 మంది పోలీసు అధికారులను సిట్ గుర్తించింది.సాయి మనోహార్, వెంకటయ్య, మద్దిపాటి శ్రీనివాస్, రాజగోపాల్, మస్తాన్ వలీ, శ్రీనివాసరావు, తిరుపతిలతో పాటు 12 మంది పోలీసు అధికారులపై చర్యలు తీసుకొనేందుకు సిట్ సన్నద్దమైనట్టు సమాచారం.వీరిపై చర్యలను తీసుకొనే అవకాశాలు లేకపోలేదు.

నోటీసులు జారీ చేయనున్న సిట్

నోటీసులు జారీ చేయనున్న సిట్

ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులకు సిట్ తొలుత నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. నిర్ణీత గడువులోపుగా సమాధానం చెప్పాలని కోరనుంది. తదుపరి వారిని సస్పెండ్ చేసి తర్వాత చార్జీషీట్ లో వీరి పేర్లను నమోదుచేసే అవకాశం ఉంది. ఈ పోలీస్ అధికారుల కార్యక్రమాలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తాయి. కాబట్టి తమ దర్యాప్తులో వెల్లడైన వివరాలతో సహా వారి జాబితాను అవినీతి నిరోధకశాఖకు పంపనున్నారు. మొత్తం మీద నయీం కేసు వచ్చేవారం కీలకమలుపు తిరగనుంది.

ఫోటోలు, వీడియోలు బయటపడడంతో విమర్శలు

ఫోటోలు, వీడియోలు బయటపడడంతో విమర్శలు

గ్యాంగ్ స్టర్ నయీంతో పోలీసు అధికారులు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపడడంతో పోలీసు శాఖ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. నయీం ఆడింది ఆట పాడింది పాటగా మారడానికి పోలీసుల సహాకారమనే కారణమని తేలింది.పోలీసు అధికారులతో పాటు కొందరు ప్రజా ప్రతినిధుల పేర్లు కూడ వచ్చాయి. వారి ఫోటోలు, వీడియోలు కూడ బయటకు వచ్చాయి.అయితే పోలీసులతో పాటు ప్రజాప్రతినిధులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.

శేషన్న ఎక్కడ?

శేషన్న ఎక్కడ?

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కీలకంగా ఉన్న శేషన్న ఇంతవరకు పోలీసులకు చిక్కలేదు.నయీం ఎన్ కౌంటర్ జరిగిన రోజు నుండే శేషన్న పారిపోయాడు. అయితే ఈ కేసులో భాగంగా శేషన్నకు డ్రైవర్ గా వ్యవహరించిన వ్యక్తిని కూడ పోలీసులు అరెస్టు చేశారు.అయితే శేషన్న ఆచూకీని ఇంతవవరకు సిట్ కనిపెట్టలేదు. నయీం చేసిన ఆకృత్యాలకు శేషన్న కీలకంగా వ్యవహరించారు. నయీం వ్యవహారాలను శేషన్న కీలకంగా వ్యవహరించేవాడని చెబుతారు. అయితే ఈ తరుణంలోనే శేషన్న ఆచూకీని పోలీసులు కనిపెట్టలేదు. అయితే శేషన్న పట్టుబడకపోతే నయీం కేసు ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయే అవకాశం ఉంటుందని నయీం బాధితులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Special investigation team(SIT) may take action against police officers who was involved with gangster Nayeem activities.SIT gathered evidences of police officers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి