భోజనం ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అత్యాచారం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారంలో ఆరేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన యువకుడు ఆదివారం అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలికపై ముదావత్ విక్రమ్ (20) అనే యువకుడు భోజనం చేయమని ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులు లేకపోవడం గమనించి భోజనం పెడుతా, రమ్మని చెప్పి అతను ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు.
బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పనేమీ చేయకుండా నిందితుడు ముదావత్ విక్రమ్ గ్రామంలో జులాయిగా తిరుగుతున్నాడని పోలీసులు చెప్పారు. బాధితురాలు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు వ్యవసాయదారులు.
అత్యాచారం జరిగిన తర్వాత బాలిక స్పృహ కోల్పోయింది. బాలికను ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురై సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు విక్రమ్ పరారీలో ఉన్నాడు.
వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు ఆత్మహత్యలు

కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలంలోని కుమ్మరికుంటకు చెందిన తుమ్మ మధుకర్ (26) అనే యువకుడు జీవితంపై విరక్తితో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధుకర్ గ్రామంలో సైకిల్ పంక్చర్ షాపును నిర్వహించి జీవనోపాధి పొందుతున్నాడు. తనకు పెళ్లి కాదేమోన ని బెంగతో తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్ర మంలో శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విద్యార్థిని ఆత్మహత్య
కోహెడ మండలంలోని కూరెల్ల గ్రామానికి చెందిన బండారి అఖిల(15) అనే విద్యార్థిని ఆదివారం సాయంత్రం ఇంట్లో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అఖిల కోహెడ హైస్కూల్ లో పదవ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా అఖిల ఇం ట్లో క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కోహెడలో ప్రథమ చికిత్స చేసి కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలో మృతిచెందింది. పోలీసులకు సమాచారం అందించారు. మృతికి కారణాలు తెలియరాలేదు.
వృద్ధుడి ఆత్మహత్మ
రామడుగు మండల కేంద్రానికి చెందిన రాగం పోచాలు(70) అనే వృద్ధుడు మతిస్థిమితం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రామడుగుకు చెందిన రాగం పోచాలు కొంతకాలంగా మతి స్థిమి తం లేకుండా తిరుగుతున్నాడు. ఆదివారం క్రిమి సంహారక మందు తాగి పడిపోగా కుటుంబ సభ్యులు కరీంగనర్ ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. చికిత్స పొందుతూ పోచాలు మృతి చెం దినట్లు ఎస్‌ఐ ప్రమోద్‌రెడ్డి తెలిపారు.
కడుపు నొప్పి భరించలేక...
ధర్మపురి మండల కేంద్రంలో బోయిని దేవయ్య (45) అనే వ్యక్తి ఆదివారం రాత్రి క డుపు నొప్పి భరించలేక ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక గిరుకల కాలనీకి చెందిన దేవయ్య కూలీ పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఇటీవల అనారోగ్యం, కడుపు నొప్పితో తీవ్ర మనస్తాపం చెందాడు. రాత్రి వేళలో నొప్పి తీవ్రం కావడంతో భాధ భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దేవయ్యకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications