SLBC Tunnel: ఆ నమ్మకంతోనే ముందుకు, 2 రోజుల డెడ్‌లైన్!

SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు.. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే, ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏమాత్రం బాగా లేదన్నారు.

ప్రమాదస్థలికి చేరుకునేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు మంత్రి చెప్పారు. దేశ సరిహద్దుల్లో టన్నెల్స్ నిర్మించే నిపుణులు, ఎక్కడ టన్నెల్ ప్రమాదం జరిినా సహాయక చర్యల్లో పాల్గొన్న నిపుణులను తీసుకొచ్చి వారి ాయం తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

SLBC Tunnel Minister Uttam Kumar says operation for 8 people will be completed in two days

సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి దెబ్బతిన్న టీబీఎంను వేరు చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ పూడికలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. మట్టి, నీరుతో పేరుకుపోయిన సిల్ట్‌ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 200 మీటర్ల వరకు బురద పేరుకుపోయిందని, పూర్తిగా నీళ్లను తోడేయాలని చెప్పారు.

కన్వేయర్ బెల్ట్ కు రిపేర్లు చేస్తున్నామని, బుధవారం రాత్రి వరకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇది అందుబాటులోి వస్తే గంటకు 800 క్యూబిక్ మీటర్ల బురదను బయటికి తీసే వీలుందన్నారు. టన్నెల్ లో గంటకు 3600 నుంచి 5 వేల లీటర్ల ఊట నీరు వస్తుందన్నారు. నీటితోపాటు బుదను బయటికి తీసేందుకు సపరేట్ పైప్ లైన్ వినియోగించనున్నట్లు వెల్లడించారు. 24 గంటలు మూడు షిప్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

ప్రకృతి విపత్తును రాజకీయం చేసి లబ్ధిపొందాలనుకునే వారి గురించి తాను మాట్లాడదల్చుకోలేదని ప్రతిపక్షాల విమర్శలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దేశ, విదేశాల్లో ఉన్న టన్నెల్ నిపుణుల సూచనలతో ముందుకెళ్తున్నామన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందికి ఎలాంటి హాని జరగలేదనే తాము భావిస్తున్నామని.. ఆ నమ్మకంతోనే వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+