SLBC టన్నెల్ ఆపరేషన్... ఈరోజు రెస్క్యూ ఆపరేషన్ పై ఉత్కంఠ!

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాద ఘటనలో సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని గుర్తించడానికి ఎన్డిఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, రాట్ హోల్ మైనర్స్, బీఆర్వో, నేవీ ,ఆర్మీ, సింగరేణి, హైడ్రా, మార్కోస్ ఇలా ఎన్నో బృందాలు శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.

ముక్కలుగా టన్నెల్ బోరింగ్ మిషన్ కట్ చేస్తున్న బృందాలు
ఒకవైపు సొరంగం లోపల 12వ కిలోమీటర్ల నుంచి పేరుకుపోయిన బురద, నీళ్లు, రాళ్లు వ్యర్ధాలను తొలగిస్తున్నారు. మరోవైపు సొరంగంలో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ ను గ్యాస్ కట్టర్లతో ముక్కలుగా కత్తిరించి వాటిని బయటకు తెస్తున్నారు. ఇక పనులలో వేగం పెంచడానికి ప్లాస్మా కట్టర్లను వాడాలని నిర్ణయించారు. మొత్తం కట్టర్ తో కూడిన టన్నెల్ బోరింగ్ మిషన్ 140 మీటర్ల పొడవు ఉంది.

SLBC Tunnel Operation tension in today rescue operation

టన్నెల్ బోరింగ్ మిషన్ 1500 టన్నుల బరువు
టన్నెల్ బోరింగ్ మిషన్ ఒకటే 1500 టన్నుల బరువు ఉంది. ఇది రెండు ప్లాట్ఫారంలుగా 120 మీటర్ల పొడవున ఉంది. ఇక పైకప్పు కూలిన ప్రమాద ఘటనలో దీనిపైన బాగా బురద. మట్టి. రాళ్లు పడింది. వీటిని తొలగించే ప్రక్రియ కొనసాగిస్తూనే యంత్రాన్ని కూడా అడ్డు తొలగించడం కోసం ముక్కలుగా కోస్తున్నారు. అయితే సొరంగంలో తొలగిస్తున్న వీటిని బయటకు తీసుకురావడం చాలా కష్టతరంగా మారింది.

నైపుణ్యం ఉన్న సిబ్బంది అవసరం
ప్రస్తుతం లోకో రైలు వ్యాగన్లలో నింపి వాటిని బయటకు పంపుతున్నారు. బురద తొలగింపు చేపడుతున్న ప్రాంతం నుంచి దాదాపు 300మీటర్ల దూరంలో లోకోరైలు ఉండడంతో కార్మికుల వ్యర్ధాలను తొలగించడం కాదు అక్కడి నుంచి వాటిని మోసుకు రావడం విషయంలో ఇబ్బంది పడుతున్నారు. విపరీతమైన బరువు ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ విడిభాగాలను త్వరగా కట్ చేసి తరలించడం కోసం అదనంగా ఇంకా నైపుణ్యం ఉన్న సిబ్బంది, కార్మికులు అవసరమని గుర్తించారు.

టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగించడానికి సింగరేణి కార్మికుల మరో యూనిట్
ఈ క్రమంలో ఇంకా అవసరమైతే సింగరేణి కార్మికులను కూడా తీసుకురావాలని నిర్ణయించారు. సింగరేణి కార్మికులు మరొక యూనిట్ ను టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగించడానికి తీసుకురానున్నారు. ఇక ఇదే సమయంలో హైడ్రా సిబ్బంది కూడా సహాయక కార్యక్రమాలలో రంగంలోకి దిగింది. ఇది ఇలా ఉంటే దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రత్యేక రెండు బృందాలను రంగంలోకి దించింది వీరంతా ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు.

భూ ఉపరితలం నుండి స్కాన్ చేస్తున్న ఎన్ఆర్ఎస్ఏ, జిఎస్ఐ
సొరంగంలో శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్ కు ఏ విధంగా సహాయం చేయడానికి అవుతుంది అనేది భూ ఉపరితలంపై నుంచి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మరియు నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థలను స్కాన్ చేస్తున్నారు ప్రమాదం జరిగిన చోట భూ పొరల అమరికాలో ఆధారంగా అందులో చిక్కుకున్న వారిని గుర్తించటానికి స్కాన్ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+