విషాదం: పక్కింట్లో మృతదేహం, చిన్నారి కళ్లను చీమలు కొరుక్కుతిన్నాయి

హైదరాబాద్: జవహర్‌నగర్ మండలం గబ్బిలాలపేట్‌లో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఓ చిన్నారి పొరుగింటి వారి బాత్‌రూంలో విగతజీవిగా కనిపించింది. ఆందోళనకు గురైన ఆ దంపతులు చిన్నారి మృతదేహాన్ని చెట్లపొదల్లో పడేశారు.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్‌ మండలం రాజవరం గ్రామానికి చెందిన రాజు, కనకమ్మ దంపతులు పదేళ్ల క్రితం జవహర్‌నగర్కు వలస వచ్చి గబ్బిలాలపేటలోని ఓఅద్దెఇంట్లో ఉంటూ కూలీపనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు యేసురాణి(6), రుత(10 నెలలు), ఒక కుమారుడు బెంజిమెన్(4)లు ఉన్నారు.

ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో రాజు నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో కూలి పనిచేస్తూ వారానికొకసారి ఇంటికి వచ్చిపోయేవాడు. తెల్లవారుజామునే నిద్రలేచే కనకమ్మ ఇంటి పనులు ముగించుకుని 5 గంటలకే పెద్ద కూతురు యేసురాణికి బెంజిమెన్, రూతు బాధ్యతలు అప్పగించే తాను కూలీపనికి వెళ్తుండేది. సాయంత్రం వరకు చిన్నారి తన తమ్ముడు, చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకునేది.

ఇదిలా ఉండగా, సోమవారం కనకమ్మ ఎప్పటిమాదిరిగానే వంటచేసి పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన కనకమ్మకు కూతురు యేసురాణి కనిపించకపోవడంతో ఆందోళన చెంది రాత్రి వరకు కాలనీలోని తెలిసిన వారి ఇళ్లలో వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో చివరికి కుటుంబసభ్యులకు విషయం చెప్పింది.

దీంతో వారు రాత్రి 8 గంటలకు జవహర్‌నగర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం తమ ఇంటి సమీపంలో ఓ చెత్త పొదల్లో యేసురాణి మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న ఏసీపీ సయ్యద్ రఫిక్, జవహర్‌నగర్ సీఐ నర్సింహారావు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు.

 విషాదం: పక్కింట్లో మృతదేహం, చిన్నారి కళ్లను చీమలు కొరుక్కుతిన్నాయి

విషాదం: పక్కింట్లో మృతదేహం, చిన్నారి కళ్లను చీమలు కొరుక్కుతిన్నాయి

బాత్‌రూంలో యేసురాణి మృతదేహం చూసి భర్త దస్తగిరికి విషయం తెలిపింది. దీంతో దస్తగిరి పాపను తామే చంపారని జనం భావిస్తారనే భయంతో వెంటనే మృతదేహాన్ని ఎదురుగా ఉన్న చెట్ల పొదల్లో పడేశాడు. అనంతరం పొదల్లోంచి మృతదేహాన్ని తీసుకొచ్చాడు.

 విషాదం: పక్కింట్లో మృతదేహం, చిన్నారి కళ్లను చీమలు కొరుక్కుతిన్నాయి

విషాదం: పక్కింట్లో మృతదేహం, చిన్నారి కళ్లను చీమలు కొరుక్కుతిన్నాయి

అప్పటికే చిన్నారి ముఖం, కళ్లను చీమలు కొరుక్కుతినడంతో గుర్తుపట్టరాకుండా తయారైంది. పోలీసులు డాగ్ స్క్వాడ్ రప్పించిన క్రమంలో దస్తగిరి, సంతోషలు ఏసీపీ రఫిక్ ఎదుట జరిగిన విషయాన్ని తెలిపారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

 విషాదం: పక్కింట్లో మృతదేహం, చిన్నారి కళ్లను చీమలు కొరుక్కుతిన్నాయి

విషాదం: పక్కింట్లో మృతదేహం, చిన్నారి కళ్లను చీమలు కొరుక్కుతిన్నాయి

ఇంట్లో ఆడుకుంటున్న పాపను దస్తగిరి,సంతోషలే చంపి చెట్లపొదల్లోకి పడేశారని యేసురాణి తాత మల్లాకి, కుటుంబీకులు ఆరోపించారు. సాయంత్రం నుండి తమతోనే ఉండి అందరిని నమ్మించేందుకు యత్నించారన్నారు. తెల్లవారుజామున పాప మృతదేహన్ని బయటకి తీసుకువచ్చి నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు.

 విషాదం: పక్కింట్లో మృతదేహం, చిన్నారి కళ్లను చీమలు కొరుక్కుతిన్నాయి

విషాదం: పక్కింట్లో మృతదేహం, చిన్నారి కళ్లను చీమలు కొరుక్కుతిన్నాయి

చిన్నారి మృతిపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫిక్ అన్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత వివరాలు తెలుస్తాయని ఏసీపీ రఫీక్ తెలిపారు. అయితే, అసలు బాత్‌రూంలోకి చిన్నారి శవం ఎలా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అప్పటికే చిన్నారి యేసురాణి మృతదేహాన్ని, ముఖాన్ని చీమలు కరవడంతో పూర్తిగా గుర్తుపట్టలేకుండా మారింది. సంఘటన స్థలం వద్దకు డాగ్ స్వాడ్‌ను రప్పించారు. జాగిలం సంఘటనా స్థలం నుండి ఏసు రాణి ఆడుకున్న స్థలం నుంచి పలు ప్రదేశాలకు వెళ్లి ఆగింది.

కనకమ్మ ఇంటిపక్కనే కూలీపనులు చేసే దస్తగిరి, సంతోష దంపతులు ఉంటున్నారు. సోమవారం రాత్రి యేసురాణి కనిపించకపోవడంతో వారు కూడా కనకమ్మతో కలిసి బాలిక కోసం గాలించారు. ఇదిలా ఉండగా, మంగళవారం తెల్లవారుజామున సంతోష నిద్రలేచి ఆరుబయట ఉన్న బాత్‌రూంకు వెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+