అప్పుడు ఎలుకలు.. ఇప్పుడు పాములు.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఏందబ్బా ఇది!!
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తుంది. గతంలో ఎలుకలు పేషెంట్ ను కొరికిన ఘటన వెలుగులోకి రాగా తాజాగా ఎంజీఎం ఆస్పత్రిలో పాముల కలకలం రేగింది. ఇటీవల వారం రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో పాము కనిపించిన ఘటన మరచిపోక ముందే మళ్ళీ తాజాగా మరో పాము పేషెంట్ లను ఆందోళనకు గురి చేసింది.

మళ్ళీ ఎంజీఎం ఆస్పత్రిలో పాము కలకలం .. ఏం జరిగిందంటే
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి లోని న్యూరో మెడికల్ వార్డులోకి మళ్లీ నాగు పాము రావటంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు, వైద్య సిబ్బంది బయటకు పరుగులు పెట్టారు. నాగుపాము రాకతో స్పందించిన రోగి బంధువులు పామును కొట్టి చంపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషంట్ బెడ్ కిందకు పెద్ద పాము రావడంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఇక పామును చంపడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు . ఆసుపత్రులకు పాములు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాముల కలకలంతో రోగుల ఆందోళన
రోగుల తరపు బంధువులు ఎప్పుడు ఏమి వార్డులోకి వస్తాయో అర్థం కావడంలేదని, ఒకపక్క ఎలుకలు, మరోపక్క పాముల దెబ్బకు ఆసుపత్రిలో ఉండాలి అంటేనే భయమేస్తుంది అని చెబుతున్నారు. ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలో చెత్తాచెదారం పెరిగిపోవడంతో పాములు పెరిగిపోయాయని, ఎలుకల సంచారం పెరిగిపోయిందని వారంటున్నారు. నెల రోజుల క్రితం పిల్లల వార్డ్ లోనూ చిన్న పాము పిల్ల సంచరించటం తో సిబ్బంది కొట్టి చంపారు.
ఎంజీఎం ఫీవర్ వార్డు లో పాము హల్చల్
ఇక
మొన్నటికి
మొన్న
ఎంజీఎం
ఫీవర్
వార్డు
లో
పాము
హల్చల్
చేసింది.
అప్పుడు
కూడా
పేషెంట్లు,
సిబ్బంది
భయంతో
పరుగులు
పెట్టారు.
ఫీవర్
వార్డులోని
బాత్
రూం
లోకి
నాగుపాము
చొరబడింది.
దీంతో
బాత్రూం
లోకి
వెళ్ళిన
పేషెంట్
అటెండర్
పామును
చూసి
భయపడిన
తెలుగు
గురయ్యారు.
దీంతో
వారు
సిబ్బందికి
సమాచారం
ఇచ్చారు.
వెంటనే
సిబ్బంది
ఆర్ఎంఓకు
సమాచారం
అందించారు.
దీంతో
స్పందించిన
అధికారులు
వెంటనే
పాములు
పట్టే
వ్యక్తి
కి
ఫోన్
చేసి
ఆ
పాముని
పట్టుకునేలా
చేశారు.
పామును
పట్టుకుని
సదరు
వ్యక్తి
ఆ
పామును
ఫారెస్ట్
అధికారులకు
అప్పగించాడు.
దీంతో
ఆస్పత్రిలో
ఉన్న
పేషెంట్లు,
ఇబ్బంది
కాస్త
ఊపిరి
పీల్చుకున్నారు.

గతంలో ఎలుకలు.. ఇప్పుడు పాములు .. ఏందబ్బా
మళ్లీ ఇప్పుడు ఆస్పత్రిలోని వార్డులోకి పాము రావడంతో ఇదెక్కడి పాముల గోల అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆసుపత్రా.. ఫారెస్ట్ నా అని రోగులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికి ఘటనలో ఒక పేషెంట్ మృతిచెందాడు. ఆ సమయంలో హాస్పటల్ సిబ్బంది, హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం లేదని రోగులు, రోగుల బంధువుల నుండి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం అయ్యింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలుకలు, పాముల సంచారం వంటి అనేక ఘటనలతో ఎంజీఎం ఆస్పత్రి అభాసుపాలవుతుంది.