Meta: తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని ప్రకటించిన మెటా..

సోషల్ మీడియా దిగ్గజం మెటా(ఫేస్ బుక్)గురువారం తెలంగాణ ప్రభుత్వంతో రెండేళ్ల భాగస్వామ్యాన్ని ప్రకటించింది. పౌర సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఇ-గవర్నెన్స్, పౌర సేవలను మెరుగుపరచడానికి ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్-2024లో ఈ ఒప్పందం జరిగినట్లు తెలిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతలను ఉపయోగించి ఇ-గవర్నెన్స్ మెరుగు పరచనున్నట్లు (Meta)మెటా ప్రకటించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఆవిష్కరణలను చేయడానికి తమ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ (IT, E&C) శాఖతో రెండు సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రకటించిందని మెటా వివరించింది. తాజా 'లామా 3.1 మోడల్'తో సహా మెటా ఓపెన్-సోర్స్ జనరేటివ్ AI సాంకేతికతలను ప్రభావితం చేసే ఇ-గవర్నెన్స్ సొల్యూషన్‌ల విస్తరణను ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వంతో మెటా భాగస్వామి కానుంది.

Social media giant Meta will work with the Telangana government

Gen AI (ఉత్పత్తి AI) వినియోగం ద్వారా ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీల సామర్థ్యం మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామని ప్రకటించింది. అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్-2024లో పలు వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదన్నారు. మొదటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారిందని.. ఇక విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయిందని గుర్తు చేశారు.

నేడు ప్రపంచ సాంకేతికరంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చాలా చర్యలు తీసుకున్నట్లు రేవంత్ వివరించారు. హైదరాబాద్ ను AI హబ్ గా తీర్చిదిద్దబోతున్నామనేందుకు ఈ సదస్సు నిదర్శనమని సీఎం స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+