• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్షల్లో జీతం ఇస్తామని నిరుద్యోగులకు ఎర.. కోట్లు దండుకుని ఓ కేటుగాడు వేశాడు టోకరా!!

|
Google Oneindia TeluguNews

మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా హైదరాబాద్లో నిరుద్యోగంతో ఇబ్బందిపడుతూ ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా తీసుకున్న ఓ కేటుగాడు ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరతీశాడు. లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగం ఇస్తామని చెప్పి, నిరుద్యోగుల నుండి కోట్ల రూపాయలను వసూలు చేసి మోసం చేశాడు. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సదరు కేటుగాడి వ్యవహారం బయటకు వచ్చింది.

సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగాల పేరుతో మోసం

సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగాల పేరుతో మోసం


ఇంతకు ఏం జరిగిందంటే హైదరాబాద్ కేంద్రంగా డన్యోన్‌ ఐటీ టెక్నాలజీ పేరుతో మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెరతీశాడు సదరు సంస్థ నిర్వాహకుడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా ఈ సంస్థలో ఉద్యోగాలకు ఆఫర్ చేసిన ప్రతాప్ అనే నిర్వాహకుడు, సంవత్సరానికి నాలుగు లక్షల జీతం ప్యాకేజీగా ఇస్తామంటూ నిరుద్యోగులకు ఎర వేసాడు. ప్రతాప్ ప్రకటనలకు బోల్తా పడిన నిరుద్యోగులు చాలామంది ఉద్యోగాల కోసం క్యూ కట్టారు.

ఇంటర్వ్యూలు, ట్రైనింగ్ లు నిర్వహించిన చీటింగ్ సంస్థ

ఇంటర్వ్యూలు, ట్రైనింగ్ లు నిర్వహించిన చీటింగ్ సంస్థ


ఇక ఉద్యోగాల కోసం టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించిన ప్రతాప్, ఆన్లైన్లో వారికి ట్రైనింగ్ ఇచ్చినట్టు బిల్డప్ కూడా ఇచ్చారు. ఇక ఆ తర్వాత అసలు పని మొదలు పెట్టిన ప్రతాప్ ప్లేస్మెంట్ ఇవ్వడం కోసం ఒక్కొక్కరికి లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వారి నుండి ఆ మొత్తం వసూలు చేశాడు. ఆపై జాబ్ ఆఫర్ లెటర్ లను సైతం వారికి పంపించాడు. ఇక తమకు జాబ్ వచ్చింది అని, ఉద్యోగం చేయడానికి వెళ్లాలని ఆశగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఆఫీస్ నుండి ఉద్యోగం చేయడానికి రమ్మని ఎటువంటి సమాచారం రాకపోవడంతో ప్రతాప్ ను ప్రశ్నించారు.

 మోసం చేసిన సాఫ్ట్ వేర్ సంస్థను ముట్టడించిన బాధితులు , పోలీసులకు ప్రతాప్ అప్పగింత

మోసం చేసిన సాఫ్ట్ వేర్ సంస్థను ముట్టడించిన బాధితులు , పోలీసులకు ప్రతాప్ అప్పగింత

త్వరలోనే ప్రాజెక్ట్ ఇస్తామని, ఉద్యోగులను నమ్మబలికి ప్రతాప్ మరికొంతకాలం వారిని మోసం చేశాడు. ఇక ప్రతాప్ ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన కొందరు డన్యోన్‌ ఐటీ టెక్నాలజీ సంస్థను ముట్టడించారు. ఇక ఒక్కసారిగా నిరుద్యోగులు అందరూ మూకుమ్మడిగా దాడి చేయడంతో ప్రతాప్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో వారు ప్రతాప్ ని పట్టుకుని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొట్లలో మోసం చేసిన కేటుగాడు

కొట్లలో మోసం చేసిన కేటుగాడు


ఒక్కో బాధితుడి నుండి లక్ష నుండి రెండు లక్షల వరకు వసూలు చేయడంతో, కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. బాధితులు తమ డబ్బు తమకు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఫిర్యాదు చేసిన బాధితులే కాకుండా ఇంకా చాలా మంది రాష్ట్రవ్యాప్తంగా ఈ సాఫ్ట్ వేర్ సంస్థ బాధితులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రతాప్ ను ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీసుల సూచన

సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీసుల సూచన

సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనలను చూసి మోసపోవద్దని పదేపదే చెబుతున్నా నిత్యం ప్రజలు మోసపోతూనే ఉన్నారని, ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏ కారణంగానూ ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వకుండా జాగ్రత్తలు పడాలని, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఇటువంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

English summary
An incident took place in Madhapur, Hyderabad, where a fraudster who lured the unemployed with the promise of salary in lakhs and extorted crores of rupees with the name of danyon software company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X