Kphbలో వేశ్యను బుక్ చేసుకోబోయి...
హైదరాబాద్‌లో ఒక యువతితో ఏర్పడిన వివాదం కారణంగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కొందరు యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన కేపీహెచ్‌బీలో చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
హిమాయత్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుగౌడ్, ఈ నెల 15న కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నెం.1 వద్ద ఒక యువతితో సంభాషించాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆ యువతి తన బంధువైన సోహెల్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది.

సోహెల్ వెంటనే స్పందించి, తన అనుచరులైన సాయికుమార్, సిసింధర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి అలియాస్ పాండు, అశ్వనీ కుమార్ సింగ్‌తో పాటు మరికొందరితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. వారంతా కలిసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మధుగౌడ్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మధుగౌడ్‌ను ఆసుపత్రిలో చేర్చారు.
బాధితుడు మధుగౌడ్ ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ యువతి వేశ్య అనుకోని మధుగౌడ్ ఆమెతో మాట్లాడటం జరిగిందని తెలుస్తోంది. తాను అలాంటి అమ్మాయిని కాదని చెబుతున్నప్పటికీ, ఆ అమ్మాయిని బలవంతం చేయడంతోనే ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది.
గాయపడిన మధుగౌడ్ స్థానిక పోలీస్ కుమారుడని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేసి, దాడికి పాల్పడిన నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications