కెసిఆర్‌పై సోమనాథ్ భారతి మండిపాటు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అమ్ ఆద్మీపార్టీ జిల్లా కార్యాలయాలన్ని ఢిల్లీ ఎమ్మెల్యే సోమనాధ్ భారతి ప్రారంభించారు. మొదట ఆర్‌ఆండ్‌భి అతిధి గృహంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ర్యాలీగా నూతన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు .తర్వాత పాలమూరు యునివర్సిటీలో 15 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న బోధనేతర సిబ్బంది శిభిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.
అవినీతిరహిత పాలన అందిస్తున్న తమ పార్టీ ఢిల్లీతోపాటు మిగిలిన రాష్ట్రల్లో విస్తరిస్తుందని ఆయన చెప్పారు.తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు మరిచిపోయారని అందుకే ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణలో కూడ తమపార్టీ 2019లో అధికారంలోకి వస్తుందన్నారు. ఢిల్లీలో సైనికుని విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు.
తెలంగాణలో విద్యార్దులు ఫీజు రీఎంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లకోసం రోడ్లపై ఆందోళనలు చేయటం సరికాదని అన్నారు. పార్టీ అభ్యున్నతికి కార్యకర్తలు నిబద్దతతో పనిచేయాలని కార్యకర్తల సమావేశంలో ఆయన కోరారు. కార్యక్రమంలో ఆప్ జిల్లా కన్వీనర్ బాబుల్‌రెడ్డి, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications