కన్నతల్లిపై తనయుడి అత్యాచారం: గునపంతో పొడిచి చంపిన తల్లి

హైదరాబాద్: మద్యం మత్తులో కన్నతల్లిపైనే తనయుడి అత్యాచారం చేయబోతే కడతేర్చిన ఉదంతమిది. కరీంనగర్ జిల్లా మల్యాల మండలం రాజారాంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలం సృష్టించింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

రాజారాం గ్రామానికి చెందిన శివరాత్రి నర్సవ్వ, కుర్రయ్య దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కుమార్తెకు వివాహమై అత్తవారింటికి వెళ్లిపోయింది. జీవనోపాధి కోసమని కుర్రయ్య ఏడాది క్రితమే దుబాయ్‌కు వెళ్లాడు.

కొడుకు రాజిరెడ్డి (22) మద్యానికి అలవాటుపడి జులాయిగా తిరుగుతున్నాడు. గతంలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ సంఘటనతో పాటు, ప్రేమజంటను బెదిరించి సెల్‌ఫోన్ లాక్కొన్న కేసు లోనూ అతను ప్రధాన నిందితుడు.

Son Killed By Attempt to Rape Mother in Karimnagar

ఇటీవల తప్పతాగి రాత్రివేళ ఇంటికొచ్చి కన్నతల్లిపైనే అత్యాచారానికి యత్నించాడు. గురువారం రాత్రి కూడా మళ్లి తల్లిపై బలవంతం చేయబోయాడు. భయాందోళనకు గురైన ఆ కన్నతల్లి తలుపులు వేసుకుని ఇంట్లో పడుకోగా ఇంటి ముందు మంచంపై రాజిరెడ్డి నిద్రించాడు.

పశువులా ప్రవర్తిస్తున్న కన్నపేగును కడతేర్చడానికి నిర్ణయించుకున్న తల్లి అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోతున్న కొడుకు మెడపై గునపంతో పొడిచింది. దీంతో అతడు మంచంపైనే ప్రాణం విడిచాడు. తెల్లవారిన తర్వాత నిందితురాలు పోలీసు స్టేషన్‌లో లోంగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+