• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మార్ట్ ఫోన్ కోసం తల్లిని చంపిన తనయుడు; జోగులాంబ గద్వాల్ జిల్లాలో దారుణం

|
Google Oneindia TeluguNews

సమాజంలో మనుషుల మీద కంటే వస్తువుల మీద జనాలకు ప్రేమ ఎక్కువైంది. ముఖ్యంగా సెల్ ఫోన్లు మనుషుల జీవితంలో ఒక భాగంగా మారిన తర్వాత ఫోన్ లేకపోతే పూట గడవని పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న పిల్లలు సైతం స్మార్ట్ ఫోన్ లకు అలవాటుపడి ఫోన్ లేకపోతే నానా రచ్చ చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ ఫోన్ కొనివ్వాలంటూ తల్లితో ఘర్షణ పడిన ఓ యువకుడు ఏకంగా రోకలిబండతో తలపై బలంగా మోదాడు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మరణించగా, కొడుకు కటకటాలపాలయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

కేంద్రానికి డెడ్ లైన్; ఉగాది తర్వాత తెలంగాణా ఉగ్రరూపం: మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ వార్నింగ్కేంద్రానికి డెడ్ లైన్; ఉగాది తర్వాత తెలంగాణా ఉగ్రరూపం: మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ వార్నింగ్

స్మార్ట్ ఫోన్ కోసం తల్లిని వేధించిన తనయుడు

స్మార్ట్ ఫోన్ కోసం తల్లిని వేధించిన తనయుడు


గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న వారి పెద్ద కుమారుడైన మహేష్ ఇంటర్ పూర్తిచేశాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులతో కలిసి కూలిపనులకు వెళుతుండే మహేష్, తల్లిని స్మార్ట్ ఫోన్ కొని ఇవ్వాలని కోరాడు. స్మార్ట్ ఫోన్ కొనడానికి తన వద్ద డబ్బులు లేవని, తర్వాత కొనిస్తానని తల్లి కుమారుడికి సర్ది చెప్పింది. అయినా మహేష్ తల్లిని పదేపదే స్మార్ట్ ఫోన్ కోసం వేధించడం ప్రారంభించాడు.

రోకలి బండతో తల్లి తలపై మోదిన తనయుడు

రోకలి బండతో తల్లి తలపై మోదిన తనయుడు


తనకు కచ్చితంగా ఫోన్ కావాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకోకుండా ఫోన్ కోసం గొడవ పడుతున్న కొడుకును తల్లి కోప్పడింది. ఇక ఈ విషయంలో తల్లి కొడుకుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నాడు మరోసారి తనకు స్మార్ట్ ఫోన్ కావాల్సిందేనని తల్లితో గొడవ పడిన కుమారుడు ఆవేశంలో రోకలిబండతో తల్లి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన తల్లి క్రింద పడిపోయింది.

 తల్లి మృతి .. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తల్లి మృతి .. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు


తీవ్ర రక్తస్రావం కావటంతో విషయం తెలుసుకున్న స్థానికులు 108 కు ఫోన్ చేసి తల్లిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ వచ్చేటప్పటికే తల్లి మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ మాట అటుంచి నవమాసాలు మోసి కానీ పెంచిన తల్లిని పోగొట్టుకోవటం మాత్రమే కాదు. తల్లిని చంపిన నేరానికి సదరు తనయుడు కటకటాల పాలయ్యాడు.

మృతురాలి మరో కుమారుడు కూడా జైల్లోనే ..

మృతురాలి మరో కుమారుడు కూడా జైల్లోనే ..

ఇదిలా ఉంటే ఇటీవల లక్ష్మి మరో కుమారుడైన సాల్మన్ కారు అద్దాలు పగలగొట్టి ఇద్దరిని గాయపరిచిన ఘటనలో జైలుకు వెళ్ళాడు. తమ్ముడు జైలుకు పంపించిన వారిపై కక్ష పెంచుకున్న మహేష్ మూడు రోజుల క్రితం రైతుల పొలాలను మిరప పంటకు నిప్పు పెట్టాడు. ఆ సమయంలో అతని చేతులకు గాయాలయ్యాయి. కుమారుడి చేతుల గాయాల కారణంగా లక్ష్మి కూలిపనులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటుంది. ఇక ఇదే సమయంలో సెల్ ఫోన్ విషయంలో ఘర్షణకు దిగిన కొడుకు క్షణికావేశంలో తల్లిని రోకలిబండతో మోది ఆమె ప్రాణాలు తీశాడు.

English summary
The son who harassed his mother for a smart phone finally killed his mother. The incident took place in Jogulamba Gadwal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X