హైదరాబాద్‌లో సోనియా గాంధీకి ఘన స్వాగతం, మేడ్చల్ వేదికపై 119మంది అభ్యర్థులు

Recommended Video

    Telangana Elections 2018 : టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని చెప్పులతో వెంబడించిన జనం | Oneindai Telugu

    మేడ్చల్: యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇటీవల కేసీఆర్ తన అసెంబ్లీని రద్దు చేయడంతో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రచారం నిమిత్తం సోనియాతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ వచ్చారు.

    సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఘన స్వాగతం పలికేందుకు బేగంపేట విమానాశ్రయానికి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వారికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా మేడ్చల్ బహిరంగ సభకు బయలుదేరారు. మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున కే లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు.

    తెలంగాణ ఏర్పాటైన అనంతరం తొలిసారి సోనియా గాంధీ వస్తున్నందున ఆమె ఏం చెబుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. తెలంగాణ రావడానికి సోనియా గాంధీయే కారణమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీనిని 2014లో క్యాష్ చేసుకోలేకపోయామని, ఇప్పుడైనా చేసుకోవాలని భావిస్తున్నారు.

    Sonia Gandhi to address her first public meeting in Telangana

    సోనియా గాంధీ సభలో తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం, ప్రజా యుద్ధ నౌక గద్దర్ తదితరులు పాల్గొంటున్నారు. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఆమె మిగతా రాష్ట్రాలకు వెళ్ళకుండా కేవలం తెలంగాణకే రావడం గమనార్హం.

    మహాకూటమిగా కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ పోటీ చేస్తున్న నేపథ్యంలో కూటమి తరఫున బరిలో ఉన్న 119 మంది అభ్యర్థులు ఈ సభా వేదికపై ఉండేలా ఏర్పాట్లు చేశారు. వీరితోపాటు కూటమి పార్టీల అధ్యక్షులు లేదా ముఖ్యనేతలు కూడా సభావేదికపై ఉంటారు. సుమారు రెండు వందలమంది కూర్చునేందుకు వీలుగా వేదికను సిద్ధం చేశారు.

    సోనియా శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి 5.30 గంటలకు రోడ్డు మార్గంలో మేడ్చల్‌ సభా ప్రాంగణానికి బయలుదేరి, ఆరు గంటలకు చేరుకుంటారు. రాత్రి 7.30 వరకూ సభలో పాల్గొంటారు. అనంతరం ఎనిమిది గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి వెళ్తారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+