తిరుపతి, మధురై, నాగర్ సోల్ కు ప్రత్యేక రైళ్లు: రూట్ - షెడ్యూల్..!!
రైల్వే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ల పైన కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్న 54 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రధాన మార్గాల్లో కొనసాగుతున్న రద్దీ.. డిమాండ్ కు అనుగుణం గా ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా తిరుపతి, మధురై, నాగర్ సోల్ కు వెళ్లే వారికి ప్రయోజనం కలగనుంది. పొడిగించిన రైళ్ల వివరాలను అధికారులు వివరించారు.
కాచిగూడ-మధురై మార్గంలో 07191/07192 ప్రత్యేకరైళ్లు, హైదరాబాద్-కొల్లాం మార్గంలో 07193/07194, హైదరాబాద్-కన్యాకుమారి మార్గంలో 07230/07239 ప్రత్యేకరైళ్లను పొడి గించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా సికింద్రాబాద్-తిరుపతి మధ్య 10, కాచిగూడ-నాగర్‌సోల్ మధ్య 8, నాందేడ్-తిరుపతి మధ్య 10, నాందేడ్-ధర్మవరం మధ్య 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మీదుగా ఆరు ప్రధాన మార్గాల్లో నడుస్తున్న 54 ప్రత్యేక రైళ్ళను అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించారు.

ఇక, మదురై-కాచిగూడ స్పెషల్ ట్రైన్ ఆగస్ట్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 07193/07194 నెంబర్ గల రెండు స్పెషల్ ట్రైన్‌లు హైదరాబాద్- కొల్లం మద్య రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కొల్లం వెళ్లే ఈ స్పెషల్ ట్రైన్ ఆగస్ట్ 16 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు ప్రతి శనివారం ప్రయాణి కులకు అందుబాటులో ఉండనుంది.
07230/ 07229 నెంబర్‌ల రెండు రైళ్లు హైదరాబాద్-కన్యాకుమారి మధ్య రాకపోకలు సాగించనున్నారు. 07229 నెంబర్ గల హైదరాబాద్-కన్యా కుమారి స్పెషల్ ప్రైట్ ఆగస్ట్ 13 నుంచి అక్టోబర్ 08వ తేదీ వరకు ప్రతి బుధవారం ప్రయాణికు లకు అందుబాటులో ఉండనుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications