తిరుపతికి ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!!
రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి వేళ పెరుగుతున్న రద్దీకి అనుగుణం గా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి నుంచి తిరుపతితో పాటుగా ఏపీ లోని పలు ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ విడుదల చేసారు. ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు వస్తున్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని తిరుపతికి ఈ రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు (02764) బుధవారం సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి జనగాం, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాదు, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు తిరుపతికి చేరుకొంటుంది. అదే విధంగా తిరుపతిలో ఈ ప్రత్యేక రైలు(02763) గురువారం సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి వచ్చిన మార్గం మీదుగా మరుసటిరోజు ఉదయం 6 గంటలకు చర్లపల్లికి చేరుకొంటుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక రైలు ఈ నెల 11,15 తేదీల్లో చర్లపల్లినుంచి తిరుపతికి, 9,12,16 తేదీల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి రాకపోకలు సాగనున్నాయి. ఇక, కాచిగూడలో మరో ప్రత్యేక రైలు(07655) ఈ నెల 9వ తేది సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మల్కజ్‌గిరి, చర్లపల్లి జనగాం, ఖాజీపేట, వరంగల్, మహబుబ బాదు, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు తిరుపతికి చేరుకొంటుంది.
ఈ ప్రత్యేక రైలు 10వ తేది రాత్రి 8.05 గంటలకు బయలు దేరి వచ్చిన మార్గంలో ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు కాచిగూడకు చేరుకొంటుది. కాగా, ఈ ప్రత్యేక రైలు ఈ నెల 16న కాచిగూడ నుంచి తిరుపతికి, 10, 17 తేదీల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి రాకపోకలు కొనసాగుతాయని అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications