Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సౌత్ ఈస్టర్న్ రైల్వేను కబడ్డీ ఆడేసిన దక్షిణ మధ్య రైల్వే.. తగ్గేదేలే!

ప్రజల రైలు రవాణా సౌకర్యాన్ని మెరుగుగా అందించేందుకు రైల్వే ఉద్యోగులు చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. భారతీయ రైల్వేలు, రైల్వే ఉద్యోగులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేసే ప్రయాణికుల సౌకర్యం కోసం, వారి సురక్షిత ప్రయాణం కోసం నిత్యం శ్రమిస్తారు. ఏ ఒక్క ఉద్యోగి కాస్త ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, రైల్వే ఉద్యోగులు విధినిర్వహణలో అకుంఠిత దీక్షతో పనిచేస్తారు.

47వ ఆలిండియా రైల్వే కబడ్డీ ఛాంపియన్ షిప్
ఎప్పుడూ అలెర్ట్ గా ఉంటూ విధులు చేసే రైల్వే ఉద్యోగులు అప్పుడప్పుడు ఆటవిడుపు కోసం, ఆరోగ్యం కోసం కొన్ని కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రైల్వేలో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఇటీవల సికింద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో 47వ ఆలిండియా రైల్వే కబడ్డీ ఛాంపియన్ షిప్ జరిగింది. అక్టోబర్ ఏడవ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ఈ ఛాంపియన్షిప్ హోరాహోరీగా నిర్వహించారు.

South Central Railway played Kabaddi with South Eastern Railway here is full details

Take a Poll

రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు
రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ఆధ్వర్యంలో దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ కబడ్డీ ఛాంపియన్ షిప్ ను నిర్వహించింది. ఈ ఆలిండియా రైల్వే కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలలో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే మహిళా కబడ్డీ టీం ఈ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది.

దక్షిణ మధ్య రైల్వే మహిళల జట్టు విజేతలు
సికింద్రాబాద్ లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణ మధ్య రైల్వే మహిళల జట్టు సౌత్ ఈస్టర్న్ రైల్వే ను ఓడించి 47వ ఆల్ ఇండియా రైల్వే మహిళా కబడ్డీ టోర్నమెంట్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుంది. సౌత్ ఈస్ట్రన్ రైల్వే మహిళా టీం పై బరిలోకి దిగిన సౌత్ సెంట్రల్ రైల్వే కబడ్డీ జట్టు ఆరు పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

సౌత్ ఈస్ట్రన్ రైల్వే ని వెనక్కు నెట్టిన సౌత్ సెంట్రల్ రైల్వే
ఈ పోటీలో చెన్నై లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జట్టు 3వ స్థానంలో నిలిచింది. ఈ పోటీలలో విజేతలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు. క్రీడలు మహిళల శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని, వారికి కావలసిన ఉత్సాహాన్ని ఇస్తాయని ఆయన అన్నారు. ఈ రైల్వే ఛాంపియన్షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై దక్షిణ మధ్య రైల్వే మహిళా జట్టుకు ఛాంపియన్ షిప్ ట్రోఫీ అందజేశారు. మొత్తానికి సౌత్ ఈస్ట్రన్ రైల్వే ని వెనక్కు నెట్టి సౌత్ సెంట్రల్ రైల్వే ఈ చాంపియన్ షిప్ లో తిరుగులేని విజయాన్ని సాధించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+