మహా విషాదమన్న రామోజీ .. రాగాలు మూగబోయాయన్న రాఘవేంద్రరావు... క్రిష్ , హరీష్ శంకర్ కూడా
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి యావత్ దేశాన్ని తీవ్ర ఆవేదనకు , ఉద్వేగానికి గురి చేస్తుంది .ఆయన మృతితో సంగీత ప్రపంచమే కాదు సినీ ప్రపంచం కన్నీటి పర్యంతం అవుతుంది . ఆయన మృతి తీరని లోటని , ఆయనవంటి గాయకుడు ఎవరూ లేరని పలువురు ఆయన మృతిపై స్పందిస్తున్నారు .

మనసును మెలిపెడుతున్న బాధ: రామోజీ రావు
ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిని రామోజీరావుమాటలకందని మహా విషాదంగా అభివర్ణించారు.ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నారు . ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరంటేబాధగా ఉందని, మనసు మెలి పెట్టినట్టు ఉందని అన్నారు . ఆయన గంధర్వ గాయకుడే కాదు తనకుఅత్యంత ఆత్మీయుడు అనిరామోజీరావు పేర్కొన్నారు .గుండెలకు హత్తుకుని ప్రేమగా పలకరించే తమ్ముడు అంటూసుబ్రహ్మణ్యం తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

మాటలకందని మహా విషాదం : రామోజీ
తెలుగు జాతికే కాదు ప్రపంచ సంగీతానికి ఆయన స్వరం ఓ వరంఅంటూ పేర్కొన్న రామోజీరావు 50 సంవత్సరాల ఆయన సినీ ప్రయాణంలో జాలువారిన వేలవేల పాటలుతేట తీయని తేనెల ఊటలు అని ఆయన పాటల గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు .
ఎన్నిగానాలు.. ఎన్నిగమకాలు.. ఎన్ని జ్ఞాపకాలు..ఏం గుర్తుకు వచ్చినా ఈ క్షణాలు మాకోసం మధురమైన పాటలను మిగిల్చిమరలిపోయిన స్నేహితుడికి తిరిగి కనీసం మాటలు కూడా ఇవ్వలేని మహా విషాదం అని ఆవేదన చెందారు. బాలు నీకు ఇదే మా అందరి అశ్రుతర్పణం అంటూరామోజీరావు కన్నీటిపర్యంతమయ్యారు .
సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి : దర్శకుడు రాఘవేంద్ర రావు
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అంటూ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు .
నా ప్రియమైన బాలు ..సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది . సరిగమలన్నీకన్నీళ్లు పెడుతున్నాయి. రాగాలన్నీ మూగబోయాయి.నువ్వు లేని లోటు తీర్చలేనిది అంటూ కె.రాఘవేంద్రరావుఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపైభావోద్వేగంగా స్పందించారు.ఈ మహా విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అంటోంది.

మృత్యోర్మా అమృతంగమయ, మీరెప్పుడూ మాతోనే ఉంటారు : క్రిష్, హరీష్ శంకర్
ప్రముఖ దర్శకుడు క్రిష్ మృత్యోర్మా అమృతంగమయ అంటూ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మరణంపై ట్వీట్ చేశారు . దర్శకుడు హరీష్ శంకర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపై స్పందిస్తూ ఆగిపోయింది మీ గుండె మాత్రమే మీ గొంతు కాదు మీరు ఎప్పుడూ మాతోనే ఉన్నారు ఉంటారు అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు.
తెలుగు సినీ వినీలాకాశంలోనేపథ్యగాయకుడిగా ఒక వెలుగు వెలిగిన ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం అటు తెలుగు సినీ ప్రపంచానికి కాకుండా, దక్షిణాది సినీ ప్రపంచానికి ,హిందీ సినీ జగత్తుకికూడాఆయన ఆత్మీయుడు. అందరివాడు . అందుకేయావత్ భారతదేశంఎస్పీ బాలు మృతిపై కన్నీరు పెడుతోంది.ఆయన లేని లోటు తీర్చలేనిదనిముక్తకంఠంతో నినదిస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications