వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్ పి సింగ్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన తెలంగాణ సర్కార్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్ పి సింగ్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రదీప్ చంద్ర పదవీకాలం డిసెంబర్ 31వ, తేదితో ముగిసింది.అయితే ఆయనకు కేంద్రం పదవీకాలాన్ని పొడిగించలేదు.దీంతో ఆయన స్థానంలో ఎస్ పి సింగ్ ను కొత్త సిఎస్ గా నియమిస్తూ ఆదివారం నాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

స్పెషల్ సిఎస్ లుగా ఉన్న ఎంజి గోపాల్, రాజీవ్ రంజన్ ఆచార్య, ఎస్ పి సింగ్ లలో ఎవరో ఒకరిని ఎంపిక చేయాల్సిన అనివార్య పరిస్థితులు ప్రభుత్వానికి ఉన్నాయి. దరిమిలా కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి ఎస్ పి సింగ్ వైపే సిఎం కెసిఆర్ మొగ్గుచూపారు.

new chief secretary

ఆదివారం ఉదయం పూట కొత్త సిఎస్ పై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొన్నారు. ప్రదీప్ చంద్ర స్థానంలో ఎస్ పి సింగ్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను వెలువడ్డాయి.

ఎసిబి డిజిపి గా ఉన్న ఎకె ఖాన్ పదవీకాలం కూడ ముగిసింది.అయితే ఆయనను తెలంగాణ మైనార్టీ సంక్షేమశాఖకు సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఇటీవలనే ఆయన రిటైర్మెంట్ అయ్యారు. ఓటుకు నోటు కేసు సమయంలో ఎకెఖాన్ ఎసిబి డిజిగా బాద్యతలను నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ను డిల్లీకి బదిలీచేసింది ప్రభుత్వం. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ కు అరవింద్ కుమార్ రెసిడెంట్ కమీషనర్ గా నియమించింది. తెలంగాణలో పరిశ్రమల స్థాపనలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడంలో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు,

English summary
sp singh appointed as telangana chief secretary on sunday.central governament didnot extentend the term of incumbent cs pradeeep chandra. so telangana governament appointed sp singhu as chief secretary of telangana governament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X