మసీదుల్లో రంజాన్ ప్రత్యేక ప్రార్ధనలు: ముస్లింలకు తెలంగాణా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
పరోపకారానికి, సహృద్భావానికి, సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని మక్కా మసీద్, ఢిల్లీలోని జామా మసీద్, ముంబైలోని మహీం దర్గాలతోపాటు దేశంలోని ప్రతి మసీదు లోనూ, దర్గా లోనూ, ఈద్గాల లోను రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి.
ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు . రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మసీదులన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి. ఇక రంజాన్ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని చార్మినార్ పరిసర ప్రాంతాలలో ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే ముస్లిం సోదరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన సందేశాన్ని తెలియజేశారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సోదర భావం, సహృద్భావం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తితో ఈద్-ఉల్-ఫితర్ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
అల్లా దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. గంగా జమున తెహజీబ్ కు తెలంగాణ ఆలవాలం అన్నారు. మత సామరస్యాన్ని, లౌకిక వాదాన్ని కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం విద్య, ఉపాధితో పాటు పలు రంగాల్లో ఆసరా అందిస్తూ భరోసాగా నిలిచిందన్నారు.
ముస్లింల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం అమలు చేస్తున్న ఎన్నో పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలన లో మైనారిటీల సంక్షేమానికి అభివృద్ధికి గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 13 వేల కోట్ల రూపాయలు కేటాయించి, వారికి సంక్షేమాన్ని అందిస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు ముస్లిం మైనారిటీ అభివృద్ధి మోడల్ ను దేశవ్యాప్తంగా విస్తరించడానికి కృషి చేస్తున్నామని కెసిఆర్ తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications