సికింద్రాబాద్ ప్రజలకు ముఖ్య గమనిక
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉండే ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ నుంచి బెనారస్ వరకు నాలుగు రైళ్లు నడవనున్నాయి. సెకండ్ క్లాస్ తోపాటు స్లీపర్ బోగీలుంటాయి. ఈనెల 15వ తేదీ నుంచి 22వ తేదీవరకు ఇవి నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
నెం. 07005 సికింద్రాబాద్-బనారస్ సికింద్రాబాద్ నుంచి 20వ తేదీ రాత్రి 9.40 గంటలకు బయలుదేరి 22వ తేదీ ఉదయం 6.30 గంటలకు బనారస్ చేరుకుంటుంది.
నెం. 07006 బనారస్-సికింద్రాబాద్ రైలు ఉదయం 8.35 గంటలకు బనారస్ లో బయలుదేరి ఈనెల 17, 24 తేదీల్లో సాయంత్రం 6.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఇవి జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బలార్షా, నాగ్ పూర్, ఇటార్సీ, పిపారియా, జబల్ పూర్, కట్ని, సత్నా, మాణిక్ పూర్, ప్రయాగ్ రాజ్ స్టేషన్లలో ఆగుతాయి.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఉండే దూరాన్ని తక్కువ సమయంలో అధిగమించాలనే ఉద్దేశంతో సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఇవి దాదాపు 60 మార్గాల్లో సంచరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్ నుంచి వైజాగ్, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి రేణిగుంట మీదగా చెన్నై, కాచిగూడ నుంచి బెంగళూరుకు నడుస్తున్నాయి.












Click it and Unblock the Notifications