మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు ఇవే

జనవరి 14 నుంచి 45 రోజులపాటు జరగనున్న ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి రైల్వే శాఖ పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మహా కుంభమేళాకు వెళ్లేవారి కోసం అదనంగా 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడటౌన్, ఇక, తెలంగాణ రాష్ట్రంలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. దీంతో మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు చేరవచ్చు.

Special trains from Telugu states for Maha Kumbh Mela

కోట్లాది మంది భక్తులు తరలిరానున్న ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యోగి ఆదిత్యాథ్ సర్కారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1.6 లక్షల టెంట్లతోపాటు 1.5 లక్షల టాయ్‌లెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

భక్తుల అవసరాలు, భద్రత కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలతో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కాగా, కుంభమేళాకు ముందే ఈ ఆస్పత్రిలోని వైద్యులు ఓ మహిళకు తొలి ప్రసవం చేశారు.

గంగా నది ఒడ్డున డేరా పట్టణంలో జీవనం కొనసాగించే సోనమ్ అనే మహిళకు ఆదివారం రాత్రి పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ప్రయాగ్‌రాజ్‌లోని తాత్కాలిక ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆ తర్వాత ఆమెకు మగ బిడ్డ పుట్టాడని వైద్యులు తెలిపారు. కుంభమేళా జరిగే చోట పుట్టిన క్రమంలో ఆ చిన్నారికి 'మహాకుంభ్'గా పేరు పెట్టారని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+