చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే
Special Trains from Charlapalli: వేసవి సెలవుల్లో రైల్వేకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

ఇప్పుడు తాజాగా మరో ప్రత్యేక రైలు సర్వీసును ప్రకటించారు అధికారులు. పచర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఈ వేసవి సీజన్ పొడవునా అంటే మే 31వ తేదీ వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. చర్లపల్లి నుంచి తిరుపతికి మొత్తం 16 రైలు సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి.
ఈ నెల 11వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ప్రతి శుక్ర, ఆదివారాలు అంటే- ఏప్రిల్ 13, 18, 20, 25, 27, మే 2, 4, 9, 11, 16,18, 23, 25, 30 తేదీల్లో రాత్రి 9: 35 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07017 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 10:10 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈ నెల 12వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ప్రతి ఆది, మంగళవారాలు అంటే- 14, 19, 21, 26, 28, మే 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీల్లో సాయంత్రం 4:40 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ 07018 నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7: 10 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఊందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.












Click it and Unblock the Notifications