హృదయ విదారకం: ఫ్యామిలీపైకి దూసుకొచ్చిన ఆటో, చిన్నారి మృతి(వీడియో)
హైదరాబాద్: నగరంలోని (ఉప్పల్)రామంతాపుర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో అతివేగంతో ఆటో నడిపిన ఓ డ్రైవర్.. అభం శుభం తెలియని ఓ చిన్నారి ప్రాణం తీశాడు.
తల్లి, తండ్రితో కలిసి సరదాగా నడుచుకుంటున్న వెళ్తున్న ఆ చిన్నారిని వేగంగా దూసుకొచ్చిన ఆటో డీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే ఉమేశ్ తన భార్య, పిల్లలతో కలిసి కిరాణ షాప్‌కు వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఆటో వారిని ఢీకొట్టింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఉమేశ్ కుమారుడు మోహిత్ (5)ను ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించాడు. ఉమేశ్ దంపతులు, కూతురు ఈ ప్రమాద ఘటనలో గాయాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
A drunken driving accident caught on cam in Uppal area in #Hyderabad. A speeding auto mowed down a family of four. A 5-yr-old lost his life and was declared brought dead in this accident. #DriveSafe #DontDrinkAndDrive pic.twitter.com/xezDhd9pEa
— Paul Oommen (@Paul_Oommen) September 10, 2018
అప్పటి వరకు తమతోనే ఉన్న కుమారుడు క్షణాల్లో విగతజీవిగా మారడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఆర్తనాదాలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించాయి.
కాగా, ప్రమాద స్థలంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో, వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కాగా, రోడ్లు ఇరుకుగా ఉన్నప్పటికీ దుకాణదారులు ఫుట్‌పాత్ ఆక్రమణలకు పాల్పడుతుండటం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications