హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీ ఫ్లైఓవర్లకు ఏమైంది?: జారిపడిపోతున్న బైకర్లు, ఆందోళన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలోని పలు ఫ్లైఓవర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం నగరంలోని పలు ఫైఓవర్లపై బైకర్లు పదుల సంఖ్యలో జారిపడ్డారు. దీంతో వారిలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదాలకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వాతావరణంలో అనూహ్య మార్పుతోపాటు ఉన్నట్టుండి శుక్రవారం ఉదయం చిరు జల్లులు కురిశాయి. దీంతపాటు పలు ప్రాంతాల్లో ఓ ఆయిల్ ట్యాంకర్ లీకవడంతో ఆ ఆయిల్ రోడ్లు, ఫ్లైఓవర్లపై పడింది. ఈ క్రమంలో ఎప్పటి లానే కార్యాలయాలు, ఇతర పనుల నిమిత్తం వెళ్తోన్న వాహనదారులకు వింత అనుభవం ఎదురైంది.

 సాధారణ వేగంతో వెళ్లినా..

సాధారణ వేగంతో వెళ్లినా..

సాధారణ వేగంతో వెళ్తున్నా.. ద్విచక్రవాహనాలు వరుసగా జారి కింద పడ్డాయి. ఒకటి, రెండు కాదు పదుల సంఖ్యలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. మామూలుగా వెళ్తోన్న వాహనాలు ఒక్కసారిగా కింద పడడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు.

 వాహనదారులకు అర్థం కాలేదు..

వాహనదారులకు అర్థం కాలేదు..

ఒకటి, వెనుక ఒకటి వస్తోన్న బైక్‌లు అదే క్రమంలో జారి పడ్డాయి. ఉన్నట్టుండి వాహనాలు ఎందుకు స్కిడ్‌ అయ్యాయో అప్పటి వరకూ వాహనదారులకూ అర్థం కాలేదు. తీరా చూస్తే.. ఆ రోడ్డుపై ఆయిల్‌ ఉన్నట్టు కనిపించింది. గ్రేటర్‌లోని తెలుగు తల్లి, లాలాపేట ఫ్లైఓవర్లపై ద్విచక్రవాహనదారులు ఎక్కువ సంఖ్యలో జారిపడడటం గమనార్హం.

ఇవే కారణాలా?

ఇవే కారణాలా?

తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు దిగే చోట శుక్రవారం ఉదయం 9-9.30 గంటల మధ్యలో వాహనాలు ఒక్కొక్కటిగా అదుపు తప్పి కింద పడ్డాయి. లోయర్‌ ట్యాంక్‌బండ్‌ డంపింగ్‌ యార్డు ఎదరుగా ఉన్న రోడ్డుపైనా కొన్ని వాహనాలు స్కిడ్‌ అయ్యాయి. జీహెచ్‌ఎంసీ చెత్త తరలింపు వాహనాలు, ఇతర వెహికిల్స్‌ నుంచి కారిన ఆయిల్‌ కూడా ప్రమాదాలకు కారణమని చెబుతున్నారు.

ఆయిలా? వర్షమా?

ఆయిలా? వర్షమా?

వర్షం పడడంతో అంతకుముందు ఉన్న ఆయిల్‌ ద్రవరూపంగా మారి ద్విచక్ర వాహనాలు అదుపు తప్పాయంటున్నారు స్థానికులు. లాలాపేట ఫ్లై ఓవర్‌ వద్దా అదే పరిస్థితి. ఇక్కడ కూడా వాహనదారులు అదుపు తప్పి కింద పడ్డారు. ఇదిలా ఉంటే వర్షపు చినుకుల్లోనే తేడా ఉందని కొందరు అభిప్రాయపడుతుండగా.. అదే నిజమైతే ఇతర ప్రాంతాల్లో కూడా ప్రమాదాలు జరగాలి కదా..? అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

నాణ్యతా లోపమేనా?

నాణ్యతా లోపమేనా?

పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తి క్రమంలో వెలువడే వ్యర్ధాల నుంచి బీటీ ద్రావకం తయారు చేస్తారు. వ్యర్ధాలను నిర్ణీత ప్రమాణాల ప్రకారం శుద్ధి చేసి ఆ ద్రావకాన్ని బీటీలో ఉపయోగిస్తారు. శుద్ధి సరిగా చేయకుండా తయారు చేసిన ద్రావకంతో తయారు చేసిన నాణ్యతా రహిత బీటీతో రోడ్లు వేసినా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశముందని ఓ అధికారి చెప్పడం గమనార్హం. అంతేగాక, సీసీ రోడ్లపై బీటీ వేయడం కూడా ప్రమాదాలకు కారణమని పలువు చెబుతున్నారు.

English summary
Leak from an oil tanker at Telugu Talli flyover on Friday morning saw around 15-20 bikes skidding though there were no casualties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X