వివాహేతర సంబంధం: కూతురికి చిత్రహింసలు, ఆ సుఖం కోసమే ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే నెపంతో నాలుగేళ్ళ కూతురిపై దారుణంగా చిత్రహింసలు పెట్టింది ఓ తల్లి. అంతేకాదు తన కూతురును అనాధ బాలికను చిత్రించి నాంపల్లిలోని పోలీస్ భరోసా కేంద్రానికి తీసుకు వచ్చారు. అయితే విచారణలో అసలు విషయం వెలుగు చూడడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

దారుణం: లెక్చరర్‌పై లైంగిక వేధింపులు,ప్యాంట్ విప్పి వికృతంగా...

మాతృత్వానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించింది ఓ తల్లి. ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని స్వంత కూతురినే చిత్రహింసలు పెట్టింది. అంతేకాదు తన కూతురినే కూతురు కాదంటూ అనాధ అంటూ కట్టుకథలు అల్లింది.

భార్య సహయంతో కోడలిపై అత్యాచారం: బిడ్డకు జన్మనిచ్చిన కోడలు, డిఎన్ఏ పరీక్షతో ఇలా..

కూతురును వదిలించుకొనేందుకు కూడ సిద్దమైంది. ప్రియుడితో సుఖం కోసం నాలుగేళ్ళ కూతురికి నరకం చూపించింది ఆ తల్లి. తీవ్రంగా కాలిన గాయాలతో ఆ చిన్నారి అస్వస్థతకు గురైంది.

విహహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కూతురికి చిత్రహింసలు

విహహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కూతురికి చిత్రహింసలు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన లలిత, ప్రకాష్‌లు తమ మధ్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే నెపంతో లలిత నాలుగేళ్ళ కూతురిపై చిత్రహింసలు పెట్టారు. కాలుతున్న పెనంపై బాలికను కూర్చోబెట్టడంతో ఆ బాలిక శరీరం తీవ్రంగా కాలింది. కాళ్ళు కూడ తీవ్రంగా కాలిపోయాయి. తమ సంబంధానికి అడ్డుగా ఉందని భావించి బాలికను వదిలించుకొనేందుకు ఈ దారుణానికి ఒడిగట్టారు.

భార్య భర్తలుగా నమ్మించి ఉద్యోగాలు

భార్య భర్తలుగా నమ్మించి ఉద్యోగాలు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన లలితకు వివాహమై రూప అనే నాలుగేళ్ల కూతురు ఉంది. అదే జిల్లాకు చెందిన ప్రకాశ్‌కు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వారిద్దరూ శ్రీకాకుళం జిల్లా నుండి పారిపోయి వచ్చారు. భార్యభర్తలమని స్థానికులను నమ్మించి ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌లో మకాం పెట్టారు. సమీపంలోని ఓ హాస్టల్‌లో లలిత వంట మనిషిగా, ప్రకాశ్‌ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు.

పోలీసి స్టేషన్‌కు వెళ్ళి దొరికారు.

పోలీసి స్టేషన్‌కు వెళ్ళి దొరికారు.

పెనంపై బాలికను కూర్చోబెట్టడంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది.వారిద్దరూ తీవ్రగాయాలతో ఉన్న బాలికను తీసుకుని శనివారం రాత్రి నాంపల్లిలోని పోలీసు భరోసా కేంద్రానికి వెళ్లారు. గాయాలతో ఉన్న అనాధ బాలిక తమకు దొరికిందని కట్టుకథ చెప్పారు. అక్కడే ఉన్న చైల్డ్‌లైఫ్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్పి వారిని గోపాలపురం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది.

ఛైల్డ్‌లైన్ అధికారుల సమాచారంతో కేసు

ఛైల్డ్‌లైన్ అధికారుల సమాచారంతో కేసు

బాలికను చిత్ర హింసలకు గురిచేశారని చైల్డ్‌లైన్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లలిత, ప్రకాష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను యూసఫ్‌గూడలోని శిశువిహార్‌కు తరలించారు. పోలీసుల విచారణలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించి నాలుగేళ్ళ కూతురిపై తల్లి లలిత ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురిచేసిందని తేలింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
SR Nagar police arrested a couple for harassed four years daughter. Lalitha and Prakash living together atSRNagar. extramarital affair between Prakash and Lalitha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి