అవమానించారు.. త్యాగానికి ఇదా ఫలం, కేసీఆర్ న్యాయంచేశారు కానీ: శ్రీకాంతాచారి తల్లి ఉద్వేగం
హైదరాబాద్/యాదాద్రి: ప్రభుత్వం శ్రీకాంతాచారిని గౌరవిస్తున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు అవమానిస్తున్నారని తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తమను పిలిచి అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవమని, ఇలాంటి రోజు ఎవరో ఒకరు ఎమ్మెల్యే లేదా ఎంపీ వచ్చి శ్రీకాంతచారీ పుట్టిన ఊళ్లో పాల్గొనాలని ఆమె అన్నారు. అతను చనిపోయిన ఎల్బీ నగర్‌లో అయినా ఎమ్మెల్యే లేదా ఎంపీ పాల్గొనాలన్నారు. కానీ ఎవరూ అలా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సవాలకు వచ్చిన తనను అధికారులు అవమానించారని, దీనిపై తాను సీఎంకు ఫిర్యాదు చేస్తానన్నారు.
మరిన్ని తెలంగాణ ఆవిర్భావ వేడుకల వార్తలు చదవండి
కేసీఆర్ తెలంగాణ అమరుల కుటుంబాలకు సరైన న్యాయం చేశారని ఆమె చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చారని, రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేశారన్నారు. ఇంకా చేస్తారన్నారు. కేసీఆర్‌ను, ఆ కుటుంబాన్ని తాను అనదల్చుకోలేదన్నారు. కానీ కిందిస్థాయి జిల్లా నాయకులు కొందరు శ్రీకాంతచారి త్యాగాన్ని నీరుగార్చాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండలో శ్రీకాంతాచారి త్యాగం చేశారా, ఇప్పుడు సన్మానం చేయించుకుంటున్న వారు చేశారా అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సం అద్భుత చిత్రాలు చూడండి

గతంలో కూడా భువనగిరికి పిలిచి చివరగా పిలిచారని, ఈసారి కూడా తాను రావొద్దనుకున్నానని, కానీ కచ్చితంగా రావాలని చెబితే వచ్చానని, కానీ అందర్నీ పిలిచిన తర్వాత పిలిచారని, మొదట శ్రీకాంతాచారి త్యాగమా, వాళ్లందరిదా అని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి నడిరోడ్డుపై పెట్రోలో పోసుకొని అమ్మానాన్న అనకుండా జై తెలంగాణ అన్నారని గుర్తు చేశారు.
కానీ ఈ రోజు శ్రీకాంతచారి చావుకు, త్యాగానికి అర్థం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. మరోసారి ఇలా శ్రీకాంతచారిని అవమానిస్తే భరించేది లేదన్నారు. శ్రీకాంతచారిలో తాను ఆత్మత్యాగానికి పాల్పడేందుకు సిద్ధమన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications