జూన్‌లో వస్తానన్నావు, అప్పుడే వచ్చావా: బోరుమన్న శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబ సభ్యులు
జూన్‌లో వస్తానని అప్పుడే వచ్చావా అంటూ శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబ సభ్యులు కంటికీ మింటికీ ఏకధారగా విలపించారు.
హైదరాబాద్: అమెరికా నుంచి శవమై వచ్చిన శ్రీనివాస్ కూచిభొట్లను చూసి ఆయన కుటుంబ సభ్యులు కంటికీ మింటికీ ఏకధారగా విలపించారు. వారి రోదనలు మిన్నంటాయి. జూన్‌లో వస్తానని చెప్పినవాడివి, అప్పుడే వచ్చేశావా అంటూ వారు విలపించారు.
అమెరికాలో ఐదు రోజుల క్రితం జాత్యహంకారి చేతిలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం సోమవారం రాత్రి 9.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికా నుంచి వచ్చిన కార్గొ విమానంలో శ్రీనివాస్ మృతదేహంతోపాటు ఆయన భార్య, సోదరుడి భార్య, మరో మిత్రుడు వచ్చారు.

శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఏపి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
శంషాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ శివారు బాచుపల్లిలోని బొరంపేటలో శ్రీనివాస్ తల్లిదండ్రులు నివాసం ఉండే ప్రణీత్ బౌంటీకి మృతదేహాన్ని తరలించారు. రాత్రి గం. 11.40లకు చేరిన శ్రీనివాస్ మృతదేహాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.
బంధువులు, కుటుంబీకుల రోదనలతో అక్కడికి వచ్చినవారు చలించిపోయారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు, భార్య సునయన, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే వివేకానంద్, స్థానిక నాయకులు పరామర్శించారు.












Click it and Unblock the Notifications