మోడీతో స్నేహం కావాలి: కేటీఆర్, 'ఆ కెమెరాలు 2కి.మీ. వరకు గుర్తిస్తాయి'

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీతో తాము స్నేహం కోరుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం నాడు అన్నారు. స్నేహితుల దినోత్సవం రోజే ప్రధాని తెలంగాణకు రావడం సంతోషకరమన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు తాము ఫ్రెండ్లీని కోరుకుంటున్నామన్నారు.

కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రధాని మోడీ పర్యటనపై స్పందించారు. సామాజిక అనుసంధాన వేదిక ద్వారా ఆయన ప్రధానికి స్వాగతం పలికారు. 'స్నేహితుల దినోత్సవం రోజున మోడీ పర్యటన ఆనందదాయకం. ప్రధాని పర్యటనతో కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత స్నేహపూర్వక తోడ్పాటు ఉందని ఆశిస్తున్నా.' అని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీ సభకు రెండువేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

బేగంపేట విమానాశ్రయం నుంచి ఎల్పీ స్టేడియం వరకు మరో వెయ్యి మందితో భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు. సెక్యూరిటీ కోసం 200 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఫేస్ ముఖాన్ని గుర్తించే కెమెరాలు ఉన్నాయని చెప్పారు. మూడు అత్యాధునిక పీటీజెడ్ డ్రోమ్ కెమెరాలు ఉన్నాయన్నారు. ఈ కెమెరాలు 2 కిలోమీటర్ల వరకు వ్యక్తి ముఖాన్ని గుర్తిస్తాయన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఈ రోజు (ఆదివారం) లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్‌లకు సెలవు ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా నగరంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ప్రధాని మధ్యాహ్నం గం.2.25కు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో గజ్వెల్ చేరుకుంటారు.

రోడ్డు మార్గాన ప్రారంభోత్సవ కార్యక్రమం వద్దకు చేరుకుంటారు. మిషన్ కాకతీయను ప్రారంభిస్తారు. అలాగే ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్, ఫెర్టిలైజర్ ప్లాంట్లను రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. అక్కడ గం.4.15 వరకు ఉంటారు. తిరిగి బేగంపేట అక్కడి నుంచి ఎల్బీ స్టేడియంకు వచ్చి బీజేపీ కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

ప్రధాని మోడీ రాక సందర్భంగా కోమటిబండ వద్ద జరుగుతున్న తుది ఏర్పాట్లను శనివారం మంత్రి హరీశ్ రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్పీసింగ్, మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు విడతలు విడతలుగా వచ్చి పరిశీలించారు.

 ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

అనంతరం విలేకరులతో మాట్లాడిన హరీశ్ రావు ప్రధానమంత్రి తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నందున ఆయనను ఘనంగా స్వాగతించేందుకు ప్రతి ఒక్కరు సహృదయంతో సహకరించాలని కోరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రధానమంత్రి మోడీ, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రులతో కలిసి హెలికాప్టర్‌లో కోమటిబండకు చేరుకుంటారని వివరించారు.

ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

ప్రధానమంత్రితో పాటు ఐదుగురు కేంద్రమంత్రులు పీయూశ్ గోయల్, అనంత్‌కుమార్, వెంకయ్యనాయుడు, సురేష్‌ప్రభు, బండారు దత్తత్రేయ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని హరీష్ రావు తెలిపారు.

 ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

ప్రధానమంత్రి హెలిప్యాడ్ నుంచి నేరుగా కోమటిబండకు చేరుకొని మిషన్‌భగీరథ పైలాన్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడే నల్లా విప్పి నీరు విడుదల చేస్తారని హరీష్ తెలిపారు.

ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

అక్కడే మిషన్‌భగీరథకు సంబంధించి ఏర్పాటు చేసిన త్రీడీ, ఫోటోఎగ్జిబిషన్‌లో మిషన్‌భగీరథ పథకం గురించి ప్రధానికి సీఎం కేసీఆర్ వివరిస్తారని హరీష్ చెప్పారు. అక్కడి నుంచి సభావేదిక వద్దకు చేరుకుని వేదిక వెనుకభాగాన నాలుగు పథకాలకు శంకుస్థాపన చేస్తారని వివరించారు.

 ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

బహిరంగ సభకు హాజరయ్యేవారు మధ్యాహ్నం ఒకటి గంటల వరకే సభాస్థలికి చేరుకోవాలని హరీష్ రావు సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి చొప్పున ఆయా జిల్లాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను రిసీవ్ చేసుకొని సభావేదిక వద్దకు తీసుకెళ్తారని వివరించారు. ఎమ్మెల్యేల వెంట ఇతరులు రావద్దని సూచించారు.

ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

ఎమ్మెల్యేల పాసులు అందుబాటులో లేకపోతే సభావేదిక వద్ద ఉన్న మొదటి చెక్‌పోస్టు దగ్గర పాసులు అందజేసి సభావేదిక వద్దకి తీసుకెళ్తారని హరీష్ రావు చెప్పారు. జర్నలిస్టులకు వేదికకు కుడి వైపు మొదటి వరుసను కేటాయించడం జరిగిందన్నారు. వాహనాలకు 18చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని 15ఫైరింజన్‌లు వేదిక వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. రెండు సేఫ్ రోడ్లను ఏర్పాటు చేశామని, అత్యవసర సేవల కోసం ఈ మార్గాలను వినియోగిస్తారన్నారు.

ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు రావటం ప్రత్యేకతను సంతరించుకుంది.

ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న రాష్ర్టానికి ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన మీద ప్రభుత్వం, ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

నూతన రాష్ట్రమైన తెలంగాణ తనను తాను పునర్ణిర్మించుకుంటున్న నేపథ్యంలో రాష్ర్టాభివృద్ధికి ఆయన చేయూతను అంతా ఆకాంక్షిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని రాష్ట్రంపై వరాలు కురిపిస్తారని భావిస్తున్నారు.

 ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇతర సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు చాలాసార్లు ప్రశంసించారు. మిషన్ భగీరథ పథకం చాలా బాగుందని సాక్షాత్తూ ప్రధాని మెచ్చుకున్నారు కూడా.

ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

ఆదివారం స్వయంగా ప్రధాని మోడీ యే ఆ పథకాన్ని ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలో ఆ పథకానికి ఆయన అండ లభిస్తుందనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది.

 ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

భారీ వ్యయంతో, సాహసంతో చేపట్టిన మిషన్ కాకతీయ, భగీరథ పథకాలకు ఆర్థిక సహాయం అందచేయాలని రాష్ట్రం కూడా పలుమార్లు కోరింది.

 ప్రధాని పర్యటన

ప్రధాని పర్యటన

మరోవైపు సరళ వ్యాపార విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్‌వన్‌గా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానానికి కూడా అనేక ప్రశంసలు లభించాయి. ఈ క్రమంలోనే ప్రధాని పారిశ్రామిక విధానంపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+